అభివృద్ధిలో శిఖరాగ్రానికి తెలంగాణ : సీఎం కేసీఆర్
CM KCR | తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో శిఖరాగ్రానికి చేరిందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పబ్లిక్ గార్డెన్లో నిర్వహించగా.. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఎనిమిదేళ్ల స్వల్పకాలంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతిని విశ్లేషించుకుంటే మనం సాధించిన ఘన విజయాలెన్నో కళ్లముందు సాక్షాత్కరిస్తాయి.
75 సంవత్సరాల్లో దేశంలో ఏ రాష్ట్రం సాధించని విజయాలను 8ఏళ్లలో మన తెలంగాణ రాష్ట్రం సాధించింది. ప్రతి విషయంలో తెలంగాణ రాష్ట్రం అవతరించే నాటికి.. నేటి స్థితిగతులకు పోలికే లేదన్నది జగమెరిగిన సత్యం. ఆర్థికవృద్ధిలో, తలసరి ఆదాయం పెరుగులలో, విద్యుత్ సరఫరా, తాగు, సాగునీటి సదుపాయం, ప్రజసంక్షేమం, పారిశ్రామిక, ఐటీ రంగాలతో పాటు అనేక రంగాల్లో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలువడం మనందరికీ గర్వకారణం.
దేశానికే దిశానిర్దేశం చేసే కర దీపికగా..
అస్థిత్వం కోసం 60 సంవత్సరాలు పోరాడిన తెలంగాణ నేడు అభివృద్ధిలో శిఖరాగ్రానికి చేరి నేడు ప్రపంచం ముందు సగర్వంగా నిలిచింది. ఎనిమిదేళ్ల స్వల్పకాలంలో దేశానికే దిశానిర్దేశం చేసే కరదీపగా మారింది. ప్రజలందరి దీవెన, ప్రభుత్వ సిబ్బంది అంకితభావం వల్లనే ఇదంతా సాధ్యపడిందనేది నిస్సందేహమైన విషయం. కఠిన, పటిష్టమైన ఆర్థిక క్రమశిక్షణతో ఆదాయ వనరులను పెంచుకున్నాం. 2014-2019 వరకు 17.24శాతం సగటు ఆర్థిక వృద్ధిరేటుతో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో నిలిచింది.
ఎన్నో అవరోధాలు ఎదురైనా, కరోనా వంటి విపత్తులు ఎదురవుతున్నా తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. కరోనా సృష్టించిన సంక్షోభం నుంచి అతిత్వరగా తెలంగాణ కోలుకున్నదని భారత ఆర్థిక సర్వే 2020-21 అభినందించడం.. తెలంగాణ ఆర్థిక నిర్వహణ దక్షతకు దక్కినటువంటి గుర్తింపు. 2013-14లో తెలంగాణ ఏర్పడిననాడు రాష్ట్ర జీఎస్డీపీ రూ.5,05,849 కాగా.. 2021-22 నాటికి రూ.11,54,860కోట్లకు చేరింది. పెరిగిన ఆదాయంలో ప్రతి పైసా సద్వినియోగమయ్యే విధంగా ప్రభుత్వం జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా పెట్టుబడి వ్యయం చేస్తున్నది.
తలసరి ఆదాయం పెరుగుదలలో తెలంగాణ రికార్డు
తలససరి ఆదాయం పెరుగుదలలో కూడా తెలంగాణ రాష్ట్రం రికార్డు సాధించింది. 2014-15లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,24,124 కాగా.. 2021-22 నాటికి రూ.2,78,833కు పెరిగింది. జాతీయ సగటు ఆదాయమైన రూ.1,49,848 కంటే ఇది 86శాతం ఆదాయం. జాతీయ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం రోజు రోజుకు పెరుగుతుండడం శుభపరిణామం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

