ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి ఎదురుగాలి.. 2024లో అది బీజేపీ పతనానికి పునాది: సీఎం కేసీఆర్
కేంద్రం ఇవాళ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ బడ్జెట్ ఎవ్వరికీ పనికిరాని బడ్జెట్ అన్నారు. బీజేపీకి అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో ఎదురుగాలి వీస్తోందని.. గతంలో ఉన్నటువంటి ఆదరణ.. బీజేపీకి ఇప్పుడు లేదని.. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ ఆదరణ మరింత తగ్గుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

దేశంలో ఉన్నటువంటి రాజకీయ పక్వత లేని వాళ్లు.. రాజకీయాల గురించి పూర్తి అవగాహన లేనివాళ్లు.. రాబోయే ఐదురాష్ట్రాల ఎన్నికలు 2024 ఎన్నికలకు సెమీ ఫైనల్ అని చెబుతున్నారు కానీ.. అది తలా తోక లేని ప్రచారం. అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ స్థాయి మాత్రం తగ్గుతుంది. టీఆర్ఎస్ పార్టీకి 2014లో 63 సీట్లు వచ్చాయి. 2018లో 88 స్థానాలు వచ్చాయి. ఉత్తరప్రదేశ్‌లో నేను గ్యారెంటీగా చెప్పగలను. బీజేపీ స్థానాలు మాత్రం ఖచ్చితంగా తగ్గుతాయి. గతంలో బీజేపీకి ఉన్నటువంటి ఆదరణ తగ్గుతున్నది. అది 24లో బీజేపీ పతనానికి పునాది.. గ్యారెంటీ. అని సీఎం కేసీఆర్ నొక్కి చెప్పారు.
దేశంలో పరివర్తనమైన మార్పు రావాల్సి ఉంది
దేశంలో ఒక పరివర్తన, గుణాత్మకమైన మార్పు, ప్రబలమైన మార్పు రావాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. ఆ మార్పు కోసం.. కేసీఆర్‌గా.. ఈ దేశ బిడ్డగా ప్రజాజీవితంలో ఉన్నత స్థాయికి చేరుకున్న వ్యక్తిగా తప్పకుండా నా బాధ్యతను నేను నిర్వర్తిస్తా. ఆ బాధ్యత ఏరూపంలో ఉంటది.. ఎలా ఉంటుంది అనేది కొద్దిరోజుల్లోనే తెలుస్తుంది. చాలామందితో మాట్లాడా. దేశంలో రావాల్సిన ప్రబల పరివర్తన కోసం దేశంలో ఎలాంటి ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తాం.. అని సీఎం కేసీఆర్ తెలిపారు.
ఈరోజు బడ్జెట్ అయితే పూర్తి స్థాయిలో రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, సామాన్య ప్రజల వ్యతిరేక, దళిత వ్యతిరేక, గిరిజన వ్యతిరేక బడ్జెట్‌గా నేను అభివర్ణిస్తున్నాను అంటూ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

