CM KCR | బీజేపీ నేతలకు సిగ్గూశరం ఉంటే కృష్ణాలో వాటా తేల్చమని మోదీని అడగాలి : సీఎం కేసీఆర్
CM KCR | కాషాయ పార్టీ నేతలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ప్రారంభోత్సవం చేసిన సీఎం కేసీఆర్.. అనంతరం సింగోటం క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు.
CM KCR | కాషాయ పార్టీ నేతలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ప్రారంభోత్సవం చేసిన సీఎం కేసీఆర్.. అనంతరం సింగోటం క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బస్సులో వస్తున్న సమయంలో ఇద్దరు ముగ్గురు పిల్లలు బీజేపీ జెండా పట్టుకొని బస్సుకు అడ్డం వస్తున్నరు. ఏం తప్పు చేశాను నేను. ఏం మోసం చేశాం.
నేను ఒక్క మాట అడుతుతున్న బీజేపీ బిడ్డలను. మీకు సిగ్గూ శరం, చీమునెత్తురు, పౌరుషం ఉంటే.. పెద్ద సిపాయి పార్టీ అని మాట్లాడుతరు. పాలమూరుకు, తెలంగాణకు నీళ్ల గురించి కేంద్రాన్ని అడిగాం. కృష్ణా నదిలో వాటాతేల్చమని ప్రధాని మోదీని కోరాం. ఇంత పెద్ద విశ్వగురువు అని చెప్పుకునే ప్రధాని, మా అంత సిపాయిలు అనే బీజేపీ, ఇక్కడ పెద్ద పెద్ద పోజులు కొట్టే నాయకులు మహబూబ్‌నగర్‌లో ఉన్నరు. వాటా తేల్చేందుకు పదేళ్లు అవుతుందా? కృష్ణా ట్రిబ్యునల్‌కు రెండు రాష్ట్రాలకు నీళ్లు పంచమని లేఖ రాయించాలి. దానికి మోదీ కుయ్‌మనడు కైమనడు.
ఇక్కడ సిగ్గులేని వీల్లు బీజేపీ జెండాలు పట్టుకొని తిరుగుతున్నరు. మీకు బుద్ధి ఉంటే ఢిల్లీకి వెళ్లి కృష్ణా ట్రిబ్యునల్‌కు సిఫారసు చేయించాలి. మా వాటా కోసం సుప్రీంకోర్టుకు వెళ్లాం. కేంద్రం పిలిపించి సుప్రీకోర్టు కేసును వెనక్కి తీసుకోవాలన్నారు. ఏడాది అయినా అతీగతి లేదు. సిగ్గులేని బీజేపీ నాయకులు మేం జాతీయ ఉపాధ్యక్షులమంటూ అడ్డంపొడువు మాట్లాడుతున్నరు. ప్రజలు వారిని నిలదీయాలి. పాలమూరులో జరిగిన నష్టం చాలు. ఎవరైనా బీజేపీ నాయకులు జెండాలు పట్టుకొని వస్తే నిలదీయాలి. పదేళ్లు అవుతుందా? కృష్ణా ట్రిబ్యునల్‌కు సిఫారసు చేయడం లేదు’ అంటూ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

