CM KCR | అది భూమాతనా..? భూమేతనా..? కాంగ్రెస్ మేనిఫెస్టోపై సీఎం కేసీఆర్ సెటైర్లు
CM KCR | కాంగ్రెస్ మేనిఫెస్టోపై ముఖ్యమంత్రి కేసీఆర్ సెటైర్లు వేశారు. ధరణిని తీసేసి భూమాత పెడుతామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.. అది భూమాతానా..? భూమేతనా..? అని కేసీఆర్ విమర్శించారు. మానకొండూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని రసమయి బాలకిషన్‌కు మద్దతుగా ప్రసంగించారు.
CM KCR | మానకొండూరు : కాంగ్రెస్ మేనిఫెస్టోపై ముఖ్యమంత్రి కేసీఆర్ సెటైర్లు వేశారు. ధరణిని తీసేసి భూమాత పెడుతామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.. అది భూమాతానా..? భూమేతనా..? అని కేసీఆర్ విమర్శించారు. మానకొండూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని రసమయి బాలకిషన్‌కు మద్దతుగా ప్రసంగించారు.
అధికారంలోకి వస్తే మూడే గంటలు కరెంట్ ఇస్తమని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కర్ణాటకలో 20 గంటల కరెంట్ ఇస్తమని నరికారు.. కానీ 3 గంటలే ఇస్తున్నారు. కర్ణాటక నుంచి వచ్చిన డీకే శివకుమార్.. కేసీఆర్ కర్ణాటకలో 5 గంటల కరెంటో ఇస్తున్నామని అంటే.. సన్నాసి కొడుకా 24 గంటలు ఇస్తున్నామని చెప్పిన.. దయచేసి అందరూ ఆలోచించాలి. ఇది రైతుల యొక్క జీవన్మరణ సమస్య. ఓట్లు అంటే మమూలు విషయం కాదు. అందుకే చెప్పిన ఓటు మన తల రాత మారుస్తది. ఐదేండ్ల భవిష్యత్‌ను నిర్ణయిస్తది. జాగ్రత్త అని కేసీఆర్ సూచించారు.
ధరణి ఎత్తేస్తే మళ్లీ దళారుల రాజ్యం..
ధరణి తీసి బంగాళాఖాతంలో వేస్తరట కాంగ్రెసోళ్లు. వాళ్లు వస్తే వచ్చినాటికి సచ్చినాటికి కానీ. కాంగ్రెస్ మాటలను మీరంతా విమర్శించాలి. ధరణి తీసి బంగాళాఖాతంలో వేసి భూమాత పెడుతరట. అది భూమాతనా.. భూమేతనా..? మళ్లా వీఆర్వోలను తీసుకొస్తాం. 34 కాలమ్స్ పెడుతాం. కౌలుదార్ల కాలం పెడుతాం. అంటే రైతులకు కౌలుదార్లకు జుట్లు జట్లు ముడేస్తర..? ధరణి తీస్తే రైతుబంధు ఎలా వస్తుంది. మళ్లా వీఆర్వోలు, అగ్రికల్చర్ ఆఫీసర్లు సంతకం, సర్టిఫికెట్ తీసుకురా అంటరు. మళ్లీ లంచాలు, దళారీల రాజ్యం, వీఆర్ఎవోల రాజ్యం వస్తది అని కేసీఆర్ మండిపడ్డారు.
మన బతుకే ఉద్యమమా..?
మీ భూముల మీద యాజమాన్యం మీ చేతుల్లో లేకుండే. పెత్తనం ఆఫీసర్లది ఉండే. ఇప్పుడే హక్కులు మీకే ఇచ్చాం. మీ బొటనవేలితో మీ భూమి హక్కు మారుతుది. మీ భూమిని సీఎం కూడా మార్చలేడు. మరి ఇంత మంచిగా ఉన్న అధికారాన్ని తీసి ఉంచుకుంటారా..? పొడగొట్టుకుంటారా..? దయచేసి నిర్ణయం చేయాలి. ఆలోచన చేయాలి. మళ్లా ధర్నాలు, నిరసనలు, బాలకిషన్ పాటలు.. మన బతుకే ఉద్యమమా..? గత పదేండ్ల నుంచి 70 ఏండ్లలో లేనంత శాంతంగా ఉంది తెలంగాణ. ఎవరికి తోచిన పని వారు చేసుకుంటున్నారు. వ్యవసాయ రంగం కుదుటపడ్డది. రైతుల ముఖాలు తెల్లవడ్డాయి. గ్రామాల్లో ఇండ్లు కట్టుకున్నాం. పల్లెల్లో పల్లె దవాఖానాలు, బస్తీల్లో బస్తీ దవాఖానాలు, నియోజకవర్గంలో 100, 200 పడకల దవాఖానాలు, హైదరాబాద్‌లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తున్నాం అని కేసీఆర్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

