CM KCR | బీఆర్ఎస్లో చేరిన కాసాని జ్ఞానేశ్వర్.. సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
CM KCR | ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ఈటల రాజేందర్ ఎవ్వరిని ఎదగనివ్వలేదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బండా ప్రకాశ్ ముదిరాజ్ లాంటి వాళ్లను పార్టీలోకి తీసుకొచ్చి పదవులు ఇచ్చామని, కాసాని జ్ఞానేశ్వర్‌కు అవకాశాలు ఉంటాయని కేసీఆర్ పేర్కొన్నారు. కాసాని జ్ఞానేశ్వర్‌ను సీఎం కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించి, గులాబీ కండువా కప్పారు.
CM KCR | హైదరాబాద్ : ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ఈటల రాజేందర్ ఎవ్వరిని ఎదగనివ్వలేదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బండా ప్రకాశ్ ముదిరాజ్ లాంటి వాళ్లను పార్టీలోకి తీసుకొచ్చి పదవులు ఇచ్చామని, కాసాని జ్ఞానేశ్వర్‌కు అవకాశాలు ఉంటాయని కేసీఆర్ పేర్కొన్నారు. కాసాని జ్ఞానేశ్వర్‌ను సీఎం కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించి, గులాబీ కండువా కప్పారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన బండా ప్రకాశ్‌ను ఎంపీ చేసుకున్నాం. ఆ తర్వాత ఎమ్మెల్సీ చేసుకున్నాం. ఇప్పుడు మండలి వైస్ చైర్మన్‌గా నియమించుకున్నాం. మీకు రాజకీయాలు తెలుసు.. మనకున్నవి మొత్తం 119 సీట్లు.. అందులో ఏడు మనవి కావు. మనకున్నది కేవలం 112 సీట్లు. ఆ సీట్లలో పెట్టిన వ్యక్తి పక్కా గెలవాలి. ఏదో తమాషాకు అభ్యర్థిని బరిలో దింపి, ఆ సీటును కోల్పోయి, పార్టీకి నష్టం చేకూర్చోవడం రాజకీయం కాదు.
ఎన్నికల తర్వాత హైదరాబాద్‌లో అందరం కలిసి కూర్చుందాం. ఎన్టీ రామారావు పీరియడ్‌లో లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేసి సాధించాం. దాంతో కొంత మంది రాజకీయ నాయకులు ఎదిగారు. రాజకీయంగా రాబోయే రోజుల్లో చాలా పదవులు ఉంటాయి. చాలా అవకాశాలు ఉంటాయి. ముదిరాజ్ సామాజిక వర్గం పెద్దది కాబట్టి ఆ వర్గం నుంచి మనం నాయకులను తయారు చేసుకోవాలి. జిల్లాకు ఒకరిద్దరిని తయారు చేసుకుంటే పార్లమెంట్‌కు పెట్టుకోవచ్చు.. అసెంబ్లీకి పెట్టుకోవచ్చు. ఎమ్మెల్సీలు కూడా కావొచ్చు.. అలా చాలా అవకాశాలు ఉంటాయి. రాజేందర్ అటు పోయినా.. పెద్ద మనిషి కాసాని జ్ఞానేశ్వర్ పార్టీలో చేరడం మంచి పరిణామం అని సీఎం కేసీఆర్ అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Narayanpet | నారాయణపేటలో కొట్టుకున్న బీఎస్పీ- కాంగ్రెస్ నాయకులు
ప్రేమ వేధింపులకు యువతి బలి ?
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

