CM KCR | మేం ఎన్నడూ అరాచకం చేయలేదు.. పదేండ్ల నుంచి కర్ఫ్యూ, మతకల్లోలం లేదు : సీఎం కేసీఆర్
CM KCR | తెలంగాణ రాష్ట్రంలో పదేండ్ల నుంచి కర్ఫ్యూ లేదు.. మతకల్లోలం లేదు.. చీమ కూడా చిటుక్కుమనలేదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. హిందూ, ముస్లింలందరూ కలిసి బ్రహ్మాండంగా ముందుకు వెళ్తున్నారని కేసీఆర్ తెలిపారు.
CM KCR | మిర్యాలగూడ : తెలంగాణ రాష్ట్రంలో పదేండ్ల నుంచి కర్ఫ్యూ లేదు.. మతకల్లోలం లేదు.. చీమ కూడా చిటుక్కుమనలేదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. హిందూ, ముస్లింలందరూ కలిసి బ్రహ్మాండంగా ముందుకు వెళ్తున్నారని కేసీఆర్ తెలిపారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
రాష్ట్రంలో పదేండ్ల నుంచి కర్ఫ్యూ లేదు.. మతకల్లోలం లేదు.. శాంతియుంతంగా రాష్ట్రం పురోగమిస్తుంది అని సీఎం తెలిపారు. కాంగ్రెస్ దుర్మార్గులు మా ఎమ్మెల్యే అభ్యర్థి మీద కత్తులతో దాడి చేశారు. భగవంతుడి దయ వల్ల చావలేదు. తొందరగా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ చేశాం కాబట్టి.. ప్రాణాలు కాపాడగలిగాం. మేం ఎన్నడూ అరాచకం చేయలేదు. పదేండ్లలో ఎవర్నీ ఇబ్బంది పెట్టలేదు. భగవంతుడు ఇచ్చిన శక్తితో ప్రజలకు మంచి చేశాం. దుర్మార్గాలు, దౌర్జన్యాలు, కుట్రలు, పగలు పట్టలేదు. ఆ రకంగా మేం వ్యవహారం చేయలేదు అని కేసీఆర్ స్పష్టం చేశారు.
నేను చెప్పిన మాటలను దృష్టిలో పెట్టుకుని ముందకు పోవాలి అని కేసీఆర్ సూచించారు. మనకు కులం, మతం లేదు.. జాతి లేదు. ప్రజలందరూ మనవారే. తెలంగాణలో ఏ మూలన ఉన్న వ్యక్తి అయినా మన మనిషే. తెలంగాణలో ఎవరూ బాగుపడ్డా మనం బాగుపడ్డట్టే. ప్రతి వ్యక్తి ముఖం మీద చిరునవ్వు ఉండాలి. మతకల్లోలాలు లేవు. హిందూ, ముస్లిం కలిసి బ్రహ్మాండంగా ముందుకు పోతున్నాం. హైదరాబాద్లో గతంలో ప్రతి ఏడాది కత్తిపోట్లు, మతకల్లోలాలు, కర్ఫ్యూలే. కానీ గత పదేండ్లుగా చీమ చిటుక్కుమనలేదని కేసీఆర్ పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

