Foxconn | ఫాక్స్ కాన్ పెట్టుబడులపై సీఎం కేసీఆర్ హర్షం.. లక్ష ఉద్యోగాల కల్పన గొప్ప విషయం
Foxconn | హైదరాబాద్ : రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టబోతున్న ఫాక్స్ కాన్ సంస్థకు ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) ధన్యవాదాలు తెలిపారు. ఉత్పత్తి కార్యకలాపాలకు రాష్ట్రాన్ని గమ్యస్థానంగా ఎంచుకోవడం పట్ల కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
Foxconn | హైదరాబాద్ : రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టబోతున్న ఫాక్స్ కాన్ సంస్థకు ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) ధన్యవాదాలు తెలిపారు. ఉత్పత్తి కార్యకలాపాలకు రాష్ట్రాన్ని గమ్యస్థానంగా ఎంచుకోవడం పట్ల కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగం ముఖచిత్రం మార్చిన గొప్ప సంస్థ ఫాక్స్ కాన్ అని కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఫాక్స్ కాన్కు సహాయ సహకారాలను ప్రభుత్వం అందిస్తుందని స్పష్టం చేశారు. భారీ పెట్టుబడితో లక్షకు పైగా ఉద్యోగాల కల్పనకు అవకాశం రావడం గొప్ప విషయమన్నారు.
ప్రత్యక్షంగా, పరోక్షంగా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఎలక్ట్రానిక్స్ రంగంలో దేశంలోకి వచ్చిన అతిపెద్ద, ముఖ్యమైన పెట్టుబడి ఇది. ఒకే సంస్థ ద్వారా లక్షమందికి నేరుగా ఉద్యోగాలు కల్పించనుండడం ద్వారా ఒక అరుదైన ఘనతను తెలంగాణ ప్రభుత్వం సాధించింది అని కేసీఆర్ పేర్కొన్నారు.
రాష్ట్రంలోని పారిశ్రామిక అనుకూల వాతావరణంపై ఫాక్స్ కాన్ చైర్మన్ యంగ్ లీయూ( Young Liu ) ప్రశంసలు కురిపించారు. రాష్ట్రం గురించి తమ సంస్థ విస్తృతంగా అధ్యయనం చేసిందని ఫాక్స్ కాన్ చైర్మన్ తెలిపారు.
ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్ కాన్ కంపెనీకి, రాష్ట్ర ప్రభుత్వానికి నడుమ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా Hon Hai Foxconn సంస్థ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల పరిశ్రమను నెలకొల్పేందుకు మార్గం సుగమమైంది. తద్వారా ఒక లక్ష ఉద్యోగాల కల్పనకు దారులు వేసింది. pic.twitter.com/mijPyoP0TP
— Telangana CMO (@TelanganaCMO) March 2, 2023
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

