సాగర్ ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు : సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ | టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కు ఆశీర్వచనమిచ్చి, భారీ మెజారిటీతో గెలిపించినందుకు నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలందరికీ సీఎం కేసీఆర్

హైదరాబాద్ : టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కు ఆశీర్వచనమిచ్చి, భారీ మెజారిటీతో గెలిపించినందుకు నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలందరికీ సీఎం కేసీఆర్ హృదయపూర్వక కృతజ్జతలు, ధన్యవాదాలు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వ విధానం ప్రకారం, ఎన్నికల సందర్భంలో ఇచ్చిన ప్రతి వాగ్ధానాన్ని నెరవేరుస్తామని సీఎం తెలిపారు. త్వరలోనే ఎమ్మెల్యే భగత్ తోపాటు నాగార్జున సాగర్ నియోజక వర్గం సందర్శించి ప్రజల సమస్యలన్నీ పరిష్కరిస్తామని సీఎం స్పష్టం చేశారు.
దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల పరిధుల్లో ఇటీవల మంజూరు చేసిన లిఫ్టు ఇరిగేషన్ స్కీంలను శరవేగంగా పూర్తిచేసి ప్రజలకు నీరందిస్తామని సీఎం తెలిపారు. ఎన్నికల సందర్భంలో పార్టీ నాయకుల దృష్టికి వచ్చిన ప్రజా సమస్యన్నింటిని కూడా సత్వరమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎవరు ఎన్నిరకాల దుష్ప్రచారం చేసినా.. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల తమ విశ్వాసాన్ని ప్రస్పుటంగా ప్రకటించిన ప్రజలకు సీఎం హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
రెట్టించిన ఉత్సాహంతో మున్ముందు ప్రజాసేవకు టీఆర్ఎస్ పార్టీ మరింతగా పునరంకితమౌతుందని.. సీఎం మారోమారు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. విజయం సాధించిన అభ్యర్ధి నోముల భగత్ కు సీఎం కేసీఆర్ హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. చక్కగా ప్రజాసేవ చేసి మంచి రాజకీయ భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని నోముల భగత్ కు సీఎం సూచించారు. నోముల భగత్ విజయం కోసం కృషి చేసిన టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు సీఎం అభినందనలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
నాగార్జున సాగర్‌లో టీఆర్ఎస్ ఘన విజయం
సాగర్ రిజల్ట్.. తండ్రి మెజార్టీని అధిగమించిన తనయుడు..
నా గెలుపు కోసం కృషి చేసిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు : నోముల భగత్
రౌండ్ల వారీగా నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఫలితాలు
సాగర్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ గల్లంతు
జాడ లేని జానారెడ్డి..
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahesh Babu | ‘రామాయణ’పై మహేష్ బాబు ప్రశంసలు.. ‘వారణాసి’లో శ్రీరాముడిగా ఎలా కనిపిస్తారోనని చర్చ..!
Athulya Chandra | డాక్టర్‌ను ట్రాప్ చేసి రూ.3.5 లక్షల దోపిడీ.. ‘మత్తు వదలరా’ నటి అరెస్ట్.!
US Stocks: కుప్పకూలిన స్టాక్‌మార్కెట్లు.. ట్రిలియన్ డాలర్లు కోల్పోయిన టెకీ కంపెనీలు
కళ్లకు కూలింగ్ గ్లాసెస్.. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో కీర్తి సురేశ్ అదిరిపోయే లుక్
TTD Chairman | టీటీడీ సాధికారిక మండలి ఛైర్మనుగా ముద్దాడ రవిచంద్ర ప్రమాణం
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

