శంషాబాద్ ఎయిర్‌పోర్టులో త్వరలో రెండో రన్‌వే పనులు ప్రారంభమవుతాయి: సీఎం
ప్రపంచంలో సివిల్ ఏవియేషన్ విస్తృతంగా పెరుగుతోందని, తెలంగాణలో కూడా వేగం పుంజుకున్నదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దేశంలోనే నాలుగో అతిపెద్ద ఎయిర్‌పోర్ట్‌గా నిలిచిందని చెప్పారు.
ప్రపంచంలో సివిల్ ఏవియేషన్ విస్తృతంగా పెరుగుతోందని, తెలంగాణలో కూడా వేగం పుంజుకున్నదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దేశంలోనే నాలుగో అతిపెద్ద ఎయిర్‌పోర్ట్‌గా నిలిచిందని చెప్పారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు తర్వాతి స్థానంలో మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నిలిచిందన్నారు.
భూభాగం దృష్ట్యా శంషాబాద్ ఎయిర్పోర్ట్ దేశంలోనే అతిపెద్ద ఎయిర్పోర్ట్ అని సీఎం కేసీఆర్ చెప్పారు. ఢిల్లీకంటే మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ పెద్దదని వెల్లడించారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ 5000 ఎకరాల్లో ఉంటే, మన హైదరాబాద్ ఎయిర్‌పోర్టు 5,200 ఎకరాల్లో విస్తరించి ఉందని వివరించారు. శంషాబాద్‌లో రెండో రన్‌వే ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని జీఎంఆర్‌కు చెప్పామన్నారు. టెర్మినల్‌కు ఉత్తరాన ఇంకో రన్‌వే వస్తుందని తెలిపారు. అతిత్వరలోనే రెండో రన్‌వే పనులు ప్రారంభమవుతాయని ప్రకటించారు. దేశంలోనే నాలుగో అతిపెద్ద ఎయిర్‌పోర్ట్‌గా నిలిచినందుకు సివిల్ ఏవియేషన్‌లో మరింత ముందుకు పోవాలని నిర్ణయించామని తెలిపారు. ఇందులో భాగంగానే సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని సీఎం కేసీఆర్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vidya Balan | ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్.. నా కల నెరవేరలేదంటూ విద్యాబాలన్ భావోద్వేగం!
Jobs | రైల్వేలో 1688 ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల.. సికింద్రాబాద్ జోన్లో 72 పోస్టులు
Y.S. Jagan | ఎంపీ మిథున్‌రెడ్డి కాన్వాయ్‌పై రాళ్లతో దాడులు.. ఖండించిన వైఎస్ జగన్
Farmers Protest | మోటార్లు తొలగించాలన్న ఆదేశాలకు నిరసనగా రైతుల ఆందోళన
Navaratri Brahmotsavams | మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడిగా దర్శనమిచ్చిన శ్రీ మలయప్పస్వామి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

