CM KCR | రోహిత్ రెడ్డి నిజాయితీ పరుడు.. తాండూరును మరింత అభివృద్ధి చేస్తాం : సీఎం కేసీఆర్
CM KCR | తాండూరు బీఆర్ఎస్ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డి నిజాయితీపరుడు.. ఆయన కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేర్చి, ఈ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. తాండూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని, పైలట్ రోహిత్ రెడ్డికి మద్దతుగా ప్రసంగించారు.
CM KCR | తాండూరు : తాండూరు బీఆర్ఎస్ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డి నిజాయితీపరుడు.. ఆయన కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేర్చి, ఈ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. తాండూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని, పైలట్ రోహిత్ రెడ్డికి మద్దతుగా ప్రసంగించారు.
జినుగుర్తిలో ఇండస్ట్రీయల్ పార్కు కావాలని, లారీలు పట్టణంలో ఎక్కడంటే నిలబడుతున్నాయని చెప్పారు. మహేందర్ రెడ్డికి ధన్యవాదాలు.. ఈసారి రోహిత్ రెడ్డికి టికెట్ ఇద్దామంటే ఆయన కూడా పెద్ద మనసు చేసుకుని అంగీకరించారు. ఆయన ఆశీస్సులు కూడా మనకు ఉన్నాయి. రోహిత్ రెడ్డి నిజాయితీకి నిలబడ్డ మనిషి. బీజేపీ వాళ్లు వచ్చి మన ప్రభుత్వాన్ని కూలగొట్టాలని కుట్ర చేస్తే వాళ్లను పట్టించి జైల్లో వేయించారు. బ్రహ్మాండమైన పని చేసిండు. నిజాయితీకి నిలబడ్డాడు. ఆయన అడిగింది ఏది కాదనకుండా మంజూరు చేస్తున్నాను. ఆయన వ్యక్తిగతంగా ఏది అడగలేదు. తాండూరు వెనుకబడ్డ ప్రాంతం. బోర్డర్లో ఉండే ప్రాంతం. నాకు బాగా తెలుసు. తప్పకుండా పాలిటెక్నిక్ కాలేజీతో పాటు మిగతావి కూడా ఇచ్చేద్దాం. తప్పకుండా మంజూరు చేస్తాను అవేమీ గొంతెమ్మ కోరికలు కావు. ఢిల్లీ నుంచి తెచ్చేటివి కావు. హైదరాబాద్‌లో చేసే పని కాబ్టటి నూటికి నూరు శాతం నెరవేరుస్తాను అని కేసీఆర్ హామీ ఇచ్చారు.
తండాల్లో లంబాడీ బిడ్డలే రాజ్యమేలుతున్నారు..
బంజారా బిడ్డలు మా తండాలో మా రాజ్యం కావాలని ఏండ్లు కొట్లాడారు. ఏ గవర్నమెంట్ చేయలేదు. ఈ కాంగ్రెసోళ్లు కేర్ చేయలేదు. మేం 3,500 తండాలను గ్రామపంచాయతీలుగా చేశాం. తాండూరులో 24 గ్రామ పంచాయతీలుగా చేశాం. లంబాడీ బిడ్డలే సర్పంచ్‌లుగా ఉండి రాజ్యమేలుతున్నారు. సేవాలాల్ సేన వాళ్లు మద్దతు ప్రకటించారు. వాళ్లకు ధన్యవాదాలు. సేవాలాల్ జయంతి ఘనంగా జరుపుతున్నాం. రాబోయే రోజుల్లో మరింత ఘనంగా జరుపుకుందాం. బంజారాహిల్స్‌లో బంజారాలు లేకుండా పోయారు సమైక్య రాష్ట్రంలో. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మండంగా బంజారా భవన్ కట్టాం. మన రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా బంజారా భవన్‌ను ఎయిర్ కండీషన్ సదుపాయంతో కట్టాం. బంజారాల గౌరవానికి చిహ్నంగా దాన్ని నిర్మించామని కేసీఆర్ తెలిపారు.
భారీ మెజార్టీతో గెలిపించండి.. భారీ అభివృద్ధి పనులు చేయిస్తా..
రోహిత్ రెడ్డిని గెలిపించండి. స్థానికుడు, ఇక్కడే పుట్టినవాడు. కష్టం సుఖం తెలిసిన వాడు. కారు గుర్తుకు ఓటు వేస్తే లాభం జరుగుతది. మీరు భారీ సంఖ్యలో వచ్చారు. మీరంతా పెద్ద సంఖ్యలో వచ్చారంటే తాండూరులో గులాబీజెండా ఎగిరిపోయింది. గ్యారెంటీగా రోహిత్ రెడ్డి గెలిచిపోయిండని తెలిసిపోతుంది. భారీ మెజార్టీతో గెలిపించండి.. భారీ అభివృద్ధి పనులు చేయించే బాధ్యత నాది అని కేసీఆర్ హామీ ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

