CM KCR | బాజిరెడ్డి గోవర్ధన్ ప్రజల నాయకుడు.. ఆయన ఇంటి నిండా ప్రజలే : సీఎం కేసీఆర్
CM KCR | నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రజల నాయకుడు.. ఆయన ఇండి నిండా ఎప్పుడు చూసినా ప్రజలే ఉంటారని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ప్రజల పనులు చేసిపెట్టే ప్రజా నాయకుడిని భారీ మెజార్టీతో గెలిపించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
CM KCR | నిజామాబాద్ : నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రజల నాయకుడు.. ఆయన ఇండి నిండా ఎప్పుడు చూసినా ప్రజలే ఉంటారని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ప్రజల పనులు చేసిపెట్టే ప్రజా నాయకుడిని భారీ మెజార్టీతో గెలిపించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ఇక్కడ మంచిప్ప రిజర్వాయర్ పనులు జరుగుతున్నాయి. అది త్వరలోనే పూర్తవుతది. ఇజ్రాయెల్ టెకన్నాలజీతో మూడు ఎకరాలకు ఒక ఔట్లెట్ పెట్టి ఈ నీళ్లు తీసుకువస్తాం. ఈ ప్రాజెక్టు కింద బాల్కొండ, నిజామాబాద్ రూరల్ కలిసి ఉంది. అది పూర్తయితే ఈ రెండు నియోజకవర్గాలకు నీళ్లు వస్తాయి. ఆ రిజర్వాయర్ బాధితులు ఉంటే మంచి నష్టపరిహారం ఇద్దాం. ఈ విధంగా అన్ని కార్యక్రమాలు ప్రజల కోసం చేస్తున్నాం అని కేసీఆర్ తెలిపారు.
గతంలో మూడే డయాలసిస్ సెంటర్లు ఉండే..
బీడీ కార్మికులకు ఏ ప్రభుత్వం కూడా పెన్షన్ ఇవ్వలేదు. బీడీ కార్మికుల బాధలను కండ్లారా చూశాను. 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నారు. బీడీ కార్మికులకు పెన్షన్ ఒక్క తెలంగాణలోనే ఇస్తున్నారు. కొత్త వారికి కూడా పెన్షన్ ఇస్తాం. రాష్ట్రం ఏర్పడ్డాక 103 డయాలసిస్ కేంద్రాలు నెలకొల్పాం. గతంలో మూడే సెంటర్లు ఉండే. కిడ్నీ రోగులకు కూడా 2 వేలు పెన్షన్ ఇచ్చి ఆదుకుంటున్నాం. పెన్షన్ అందుకుంటున్న వారంతా పేదోళ్లు కాబట్టి 5 వేలకు పెంచుతామని ఇటీవలే ప్రకటించానని కేసీఆర్ గుర్తు చేశారు.
గల్ఫ్ కుటుంబాలకు కూడా బీమా..
కేసీఆర్ బీమా చేపిస్తాం అని చెప్పినం. అందరికి చేపిస్తాం. గల్ఫ్ వలసపోయిన కుటుంబాలకు కూడా బీమా వర్తింపజేస్తాం. ప్రతి ఒక్కరికి బీమా వస్తది. కులం, మతం, జాతి అనే తేడా లేకుండా అందరూ సమానమని భావించి, ప్రజల అవసరాన్ని బట్టి వాళ్లకు చేసుకుంటూ పోతున్నాం. ఈ విధంగా మంచి పద్దతుల్లో రాష్ట్రాన్ని ఒక దరికి తెచ్చాం. మరి దాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. ఒక్క కేసీఆరే కొట్లడడు. మీరు కూడా కొట్లాడాలి. ఈ ఎలక్షన్లనో మీరే కొట్లాడాలి అని కేసీఆర్ పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దు..
ఇవాళ కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దు జాగ్రత్తగా ఆలోచించి ఓటేయాలి. గోవర్ధన్ ప్రజల నాయకుడు. ఆయన ప్రజా ఎమ్మెల్యే. ఆయన ఇంటి నిండా ఎప్పుడు చూసినా ప్రజలే ఉంటరు. ఎంత మంది వచ్చినా వారి పనులు చేసి పెడుతడు. సీనియర్ నాయకుడు.. మంచి నాయకుడు కాబట్టి పెద్ద మెజార్టీతో గెలిపించాలి. ఆయన కోరినటువంటి పనులను చేసి పెట్టే బాధ్యత నాది. అందులో ఏం ఇబ్బంది లేదు. మంచి నాయకుడిని గెలిపించాలని కోరుతున్నానని కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

