Gangula Kamalaker | అభివృద్ధి కొనసాగాలంటే కేసీఆర్ గెలిపించాలి : మంత్రి గంగుల కమలాకర్
Gangula Kamalaker | రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగాలంటే కేసీఆర్ను మరోసారి గెలిపించాలని మంత్రి గంగుల కమలాకర్ కోరారు. కేసీఆర్ పాలనలో శాంతి భద్రతలు భేషుగ్గా ఉన్నాయన్నారు. శాంతి భద్రతలు ఉన్నచోటే అభివృద్ధి బాగా జరుగుతుందన్నారు. కేసీఆర్ చేతుల్లోనే తెలంగాణ క్షేమంగా ఉంటుందని స్పష్టం చేశారు.
Gangula Kamalaker | కరీంనగర్ : రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగాలంటే కేసీఆర్ను మరోసారి గెలిపించాలని మంత్రి గంగుల కమలాకర్ కోరారు. కేసీఆర్ పాలనలో శాంతి భద్రతలు భేషుగ్గా ఉన్నాయన్నారు. శాంతి భద్రతలు ఉన్నచోటే అభివృద్ధి బాగా జరుగుతుందన్నారు. కేసీఆర్ చేతుల్లోనే తెలంగాణ క్షేమంగా ఉంటుందని స్పష్టం చేశారు. అభివృద్ధి.. ఆహ్లాదం.. ఆధ్యాత్మికానికి మారుపేరు కరీంనగర్.. మీ ఆకాంక్ష మేరకు అభివృద్ధి చేశాను. ఇంకా చేయాల్సి ఉందన్నారు. సమస్యలు చూసి పారిపోలేదు… పోరాటం చేశానని తెలిపారు. మరోసారి అవకాశం ఇచ్చారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆశీర్వాదంతో నాలుగోసారి బరిలో దిగుతున్నాను.. తనను ఆశీర్వదించండి అని గంగుల కమలాకర్ విజ్ఞప్తి చేశారు. కరీంనగర్లో గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడారు.
చారిత్రక నగరం కరీంనగరం.. ఉద్యమాలకు పెట్టింది పేరు ఈ గడ్డ అని మంత్రి గుర్తు చేశారు. స్వరాష్ట్ర సాధన కోసం సింహగర్జనతో సమరశంఖాన్ని పూరించింది ఇక్కడి నుంచే అని తెలిపారు. ఎన్నో ఉద్యమాలకు, పోరాటాలకు వేదికగా నిలిచిన ఘనత కరీంనగర్ది అని పేర్కొన్నారు. తనను మూడు సార్లు గెలిపించిన ప్రజల రుణం తీర్చుకునేందుకు.. సీఎం కేసీఆర్ సహకారంతో కోట్లాది రూపాయల నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ పదేండ్ల కాలంలో నగరాన్ని గొప్పగా అభివృద్ధి చేశామని చెప్పారు. కరీంనగర్లో మట్టి రోడ్డు లేకుండా చేశామని స్పష్టం చేశారు.
విలువైన ఓటును వృధా చేయొద్దు.. అభివృద్ధికి పట్టం కట్టండి అని మంత్రి విజ్ఞప్తి చేశారు. స్వలాభం కోసం… స్వార్థం కోసం పోటీ చేసేవారిని ఆదరించొద్దని సూచించారు. బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. 9వ తేదీన తొలి నామినేషన్.. 10వ తేదీన 2వ నామినేషన్ దాఖలు చేస్తానని తెలిపారు. బొమ్మకల్ హనుమాన్ టెంపుల్ నుండి ప్రచారం ప్రారంభిస్తానని చెప్పారు.
2018 ఎన్నికల్లో తనను ఓడించేందుకు కుట్రలు పన్నారని ఈటెల చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఈటెలది దుర్మార్గాపు ఆలోచన. కేసీఆర్ ఇచ్చిన బీఫామ్ తమకు పవిత్ర గ్రంథంతో సమానం అని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఫోటోతో గెలిచి.. ఏళ్ళ తరబడి పదవులు అనుభవించిన ఈటెల… ఇప్పుడు కేసీఆర్పై ఆరోపణలు చేయడం సరికాదని గంగుల కమలాకర్ మండిపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

