CM KCR | నిమ్స్ దశాబ్ది బ్లాక్ నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన
నిమ్స్ (NIMS) నూతన బ్లాక్ నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ ఎర్రమంజిల్‌లో దశాబ్ది బ్లాక్ పేరుతో నిర్మిస్తున్న నిమ్స్ హాస్పిటల్ భవనాలకు సీఎం కేసీఆర్ భూమిపూజ చేశారు.
హైదరాబాద్: నిమ్స్ (NIMS) నూతన బ్లాక్ నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ ఎర్రమంజిల్‌లో దశాబ్ది బ్లాక్ పేరుతో నిర్మిస్తున్న నిమ్స్ హాస్పిటల్ భవనాలకు సీఎం కేసీఆర్ భూమిపూజ చేశారు. ఈ దశాబ్ది భవనాల నిర్మాణంతో నిమ్స్‌లో మరో 2000 పడకలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో దేశంలో అత్యధిక సూపర్ స్పెషాలిటీ పడకలు ఉన్న దవాఖానగా నిమ్స్ ముందు వరుసలో నిలువన్నది. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక అనుబంధం2009లో ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయనకు నిమ్స్‌లోనే వైద్యం అందించారు. ఆనాటి నుంచి నిమ్స్‌తో సీఎం కేసీఆర్‌కు మంచి అనుబంధం ఉన్నది. నిమ్స్‌కు అన్ని రకాల హంగులు ఉన్నా.. అరకొర వసతులతో కొట్టుమిట్టాడుతున్న విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తించారు. అందుకే ఏటా రూ.100 కోట్లు కేటాయించి నిమ్స్‌ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇచ్చిన మాటను అమల్లోకి తెస్తూ మొదటి ఏడాదే 2014-15లో రూ.185 కోట్లు కేటాయించారు. ఆ తర్వాత క్రమం తప్పకుండా నిమ్స్‌కు నిధులు కేటాయిస్తూనే ఉన్నారు. 2022లో నిమ్స్‌కు రూ.242 కోట్లు కేటాయించగా.. ఈ ఏడాది ఏకంగా రూ.290 కోట్లు కేటాయింపులు జరిపారు. ఇప్పుడు నిమ్స్ విస్తరణకు నడుం బిగించారు.

మారిపోయిన రూపురేఖలు
నిమ్స్ దవాఖాన 2014కు ముందు అరకొర వసతులుతో కొట్టుమిట్టాడేది. తెలంగాణ రాష్ట్రం, ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దేశంలోనే అత్యుత్తమ దవాఖానల్లో ఒకటిగా మారింది. 2014 నాటికి దవాఖానలో 900 పడకలు మాత్రమే ఉండేవి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆ సంఖ్యను 1489కి పెంచారు. అంటే స్వరాష్ట్రంలో తొమ్మిదేండ్లలోనే పడకల సంఖ్య 65% పెరిగింది. 2014 నాటికి 111 మంది బోధనా సిబ్బంది ఉండగా నిరుడు చివరినాటికి ఈ సంఖ్య 264కు పెరిగింది. రెసిడెంట్ డాక్టర్లు గతంలో ఏటా 82 మందిని కేటాయించగా, ప్రస్తుతం 169 మందిని కేటాయిస్తున్నారు.

- 2014 నుంచి 2021 వరకు మొత్తం రూ.90 కోట్ల విలువైన పరికరాలను దవాఖాన కోసం కొనుగోలు చేశారు. 2022లో మరో రూ.153 కోట్ల పరికరాల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చారు.
- నిమ్స్‌లో కొత్తగా ఎమర్జెన్సీ మెడిసిన్, క్లినికల్ హెమటాలజీ, పీడియాట్రిక్ నెఫ్రాలజీ, పీడియాట్రిక్ ఆంకాలజీ, జీరియాట్రిక్ మెడిసిన్, స్టెమ్ సెల్ రీసెర్చ్ ఫెసిలిటీని (మూలకణ పరిశోధనల విభాగం) ఏర్పాటు చేసింది.
- 2014తో పోల్చితే ఓపీ 26%, ఐపీ 91% పెరిగాయి. సర్జరీలు సైతం 108% పెరిగాయి. గతం లో ఏటా కేవలం 11 వేల సర్జరీలు జరిగితే ఇప్పు డు ఏకంగా 25 వేల వరకు అవుతున్నాయి.
లక్షన్నర మందికి ఆరోగ్యశ్రీ సేవలు
నిమ్స్ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా సేవలు అందిస్తున్నది. తొమ్మిదేండ్లలో లక్షన్నర మంది లబ్ధిపొం దారు. రూ.533 కోట్ల విలువైన ఆరోగ్యశ్రీ సేవలు పేదలకు అందాయి. అవయవ మార్పిడులు ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా చేస్తున్నారు. 2014లో 26 కోట్ల విలువైన సేవలు అందగా.. 2022-23 నాటికి 97 కోట్ల విలువైన సేవలు అందించింది.
- ఉద్యోగులకు సంబంధించి ఈజీహెచ్ఎస్ కింద గత తొమ్మిదేండ్లలో రూ.87.46 కోట్ల విలువైన సేవలు అందాయి. మొత్తం 27,271 మంది వైద్య సేవలు పొందారు.
- సీఎం సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) కింద పేదల ప్రజల వైద్యం కోసం ప్రభుత్వం సుమారు రూ.200 కోట్లకు పైగా ఖర్చు చేసింది

మూడు బ్లాక్‌లు.. 2వేల పడకలు
నిమ్స్ దవాఖాన విస్తరణ పనులకు బుధవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం 33 ఎకరాల్లో నిమ్స్ విస్తరణ పనులు చేపట్టనున్నారు. మొత్తం మూడు బ్లాకులు నిర్మించనున్నారు. ఓపీ, ఐపీ, ఎమర్జెన్సీ సేవలకు ప్రత్యేకంగా బ్లాక్‌లు ఏర్పాటుకానున్నాయి. ప్రస్తుతం నిమ్స్‌కు రోజుకు సగటున 2000-3000 ఓపీ నమోదవుతున్నది. ప్రస్తుత భవనం సామర్థ్యానికి ఇది చాలా ఎక్కువ. దీంతో కొత్త భవనంలో ప్రత్యేకంగా ఓపీ సేవల కోసమే ఒక బ్లాక్‌ను ఏర్పాటు చేయనున్నారు. భవిష్యత్తులో పెరుగనున్న రద్దీ, విస్తృతం కానున్న స్పెషాలిటీ సేవలను దృష్టిలో పెట్టుకొని ఏకంగా 8 అంతస్థుల్లో ఓపీ బ్లాక్‌ను నిర్మించనున్నారు. ఎమర్జెన్సీ సేవల కోసం ప్రత్యేకంగా 8 అంతస్థులతో బ్లాక్‌ను నిర్మిస్తున్నారు. ఇన్‌పేషంట్ల కోసం 13 అంతస్థులతో మరో బ్లాక్ ఏర్పాటు చేయనున్నారు.
-
- కొత్త భవనంలో మొత్తం 30 ఆపరేషన్ థియేటర్లు ఉంటాయి. 2 వేల పడకలు అందుబాటులోకి వస్తుండగా అన్నింటికీ ఆక్సిజన్ సరఫరా ఉంటుంది. ఇందులో 1,200 ఆక్సిజన్ బెడ్లు, 500 ఐసీయూ బెడ్లు ఉంటాయి. ప్రత్యేక గది కావాలనుకునే రోగుల కోసం కొత్తగా పేయింగ్ రూమ్స్ సేవలను అందుబాటులోకి తేనున్నారు. 300 గదులు ఇందుకోసం కేటాయిస్తారు.
- ప్రస్తుతం 30 విభాగాలు ఉండగా.. విస్తరణతో వీటి సంఖ్య 35కు పెరుగనున్నది.
అవయవ మార్పిడుల్లో దేశంలోనే టాప్..
స్వరాష్ట్రంలో వసతులు పెరుగడంతో అవయవ మార్పిడులకు నిమ్స్ కేరాఫ్‌గా మారింది. కిడ్నీ, లివర్, గుండె వంటి అవయవాలు, ఎముక మజ్జ, కీళ్ల మార్పిడి, గూనిని సరిచేసే స్పైన్ డీఫార్మిటీ కరెక్షన్స్ ఆపరేషన్లలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఇవన్నీ ఆరోగ్య శ్రీ కింద ప్రభుత్వం ఉచితంగా చేయిస్తుండటం విశేషం. కేవలం సర్జరీతో ఆపకుండా వారికి జీవితాంతం అవసరమయ్యే మందులను ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నది.
2014తో పోల్చితే అవయవ మార్పిడులు
సర్జరీ 2014 వరకు తొమ్మిది ఏండ్లలో
కిడ్నీ మార్పిడి 661 753
కాలేయ మార్పిడి 0 23
గుండె మార్పిడి 0 6
బోన్ మ్యారో 46 154
కీళ్ల మార్పిడి 134 1444
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

