CM KCR | న్యూట్రిషన్ కిట్లు పంపిణీని ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్
మాతాశిశు సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు (Nutrition kit) పంపిణీని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రారంభించారు.
హైదరాబాద్: మాతాశిశు సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు (Nutrition kit) పంపిణీని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రారంభించారు. హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌లో నిమ్స్ దశాబ్ది బ్లాక్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆరుగురు గర్భిణులకు ముఖ్యమంత్రి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు.
గర్భిణుల్లో పోషకాహార లోపం, రక్త హీనత లేకుండా కాపాడేందుకు కేసీఆర్ కిట్‌కు అనుబంధంగా వీటిని అందజేస్తున్నారు. మొదటి దశలో ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్, ములుగు, నాగర్‌కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో ప్రారంభించారు. బిడ్డ పుట్టినప్పుడు కేసీఆర్ కిట్ ఇచ్చినట్లుగానే, బిడ్డ కడుపులో ఉండగానే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ ఇస్తున్నారు.
మొత్తం 8 రకాల వస్తువులు కిట్‌లో అందిస్తున్నారు. మొత్తం 6.8 లక్షల మంది గర్భిణులకు న్యూట్రిషన్ కిట్స్ ప్రయోజనం కలుగనుంది. ఇందుకోసం బడ్జెట్లో సీఎం కేసీఆర్ రూ.250 కోట్లు కేటాయించారు. ఈ కిట్‌లో కిలో న్యూట్రిషన్ మిక్స్ పౌడర్, కిలో కర్జూర, 3 ఐరన్ సిరప్ బాటిళ్లు, అరకిలో నెయ్యి, 200 గ్రాముల పల్లిపట్టి, ఒక కప్పు, ప్లాస్టిక్ బాటిల్ ఉంటాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

