HomeTelanganaCm Kcr It Minister Ktr Satthupalli Mla Sandra Venkataveeraiah And Mp Bandi Parthasarathi Reddy Prepared Portraits
కేసీఆర్పై ఆర్టిస్ట్ అభిమానం
తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తూ, రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్పై అభిమానం చాటుకున్నారు ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన ప్రముఖ చిత్రకారుడు కొట్టేటి బాలకృష్ణ.
తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తూ, రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్పై అభిమానం చాటుకున్నారు ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన ప్రముఖ చిత్రకారుడు కొట్టేటి బాలకృష్ణ.
గత పదిరోజులుగా కందులు, పెసలు, మినుములు, జొన్న, వరిధాన్యం, సజ్జలు, కొర్రలు, అనుములు, బెబ్బర్లు వాడి పెద్దపెద్ద బోర్డులపై ఎలాంటి రంగులు వినియోగించకుండా సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎంపీ బండి పార్థసారథిరెడ్డి చిత్రపటాలను తయారుచేశారు. దశాబ్ది వేడుకల్లో భాగంగా శనివారం జరగనున్న రైతు దినోత్సవంలో సత్తుపల్లి మండలం కొత్తూరు రైతువేదికలో ప్రదర్శించనున్నారు.