CM KCR | నేను కొట్లాడేది నా పదవి కోసం కాదు.. నాకు దానికి మించిన పదవున్నదా ? : సీఎం కేసీఆర్
CM KCR | తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తీసుకువచ్చిన పేరే ఆకాశమంత పెద్దదని.. దాన్ని మించిన పదవి ఉన్నదా? నా అంత ఎక్కువ కాలం పని చేసిన తెలుగు ముఖ్యమంత్రి ఎవడూ లేడు. ఈ కీర్తి నాకు చాలు’ అంటూ వ్యాఖ్యానించారు.
CM KCR | తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తీసుకువచ్చిన పేరే ఆకాశమంత పెద్దదని.. దాన్ని మించిన పదవి ఉన్నదా? నా అంత ఎక్కువ కాలం పని చేసిన తెలుగు ముఖ్యమంత్రి ఎవడూ లేడు. ఈ కీర్తి నాకు చాలు’ అంటూ వ్యాఖ్యానించారు. జగిత్యాల బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘చాలా క్లియర్‌గా జగిత్యాలలో చెబుతున్నా. చాలా మందికి తెలుస్త లేదు. నాకేం కావాలి..? తెలంగాణ తెచ్చిన పేరే ఆకాశమంత పెద్దది. దాన్ని మించిన పదవి ఉన్నదా? అయినా మీరు మన్నించి ఇచ్చారు కాబట్టి రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసినా. నా అంత ఎక్కువ కాలం పని చేసిన తెలుగు ముఖ్యమంత్రి ఎవడూ లేడు. ఈ కీర్తి చాలు నాకు’ అన్నారు.
నా తండ్లాట దానికే..
‘నేను కొట్లాడేది నా పదవి కోసం కాదు. ఖచ్చితంగా తెలంగాణ వందకు వందశాతం పేదరికం లేని తెలంగాణ కావాలి.. అది నా పంథం. కేరళ రాష్ట్రం మాదిరిగా వందశాతం అక్షరాస్యత ఉన్న రాష్ట్రం కావాలి. రైతాంగం గుండెమీద చేయి వేసుకొని ఆ హాయిగా నిద్రపోయి బ్రహ్మాండమైన పంటలు పండే తెలంగాణ కావాలి. తెలంగాణలో ప్రతి ఇంచుకు నీళ్లు రావాలి. దాని కోసం తండ్లాడున్నాం తప్పితే ఈ పదవి కోసం కాదు. నాకు 70 ఏళ్ల వయసు వచ్చింది. ఇంకా ఈ జీవితంలో. అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది. పార్టీల వైఖరి, నాయకుల ఆలోచన సరళి ఆలోచించి ఓటేయాలి తప్ప ఆగమై ఓటు వేయొద్దని మనవి చేస్తున్నా. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లో చర్చ పెట్టండి.. రాబోయే ప్రమాదాన్ని పసిగట్టండి.. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి ఘనవిజయాన్ని చేకూర్చండి. సంజయ్ అడిగిన కోరికలన్నీ నెరవేరుస్తాం. వందశాతం చేయించే బాధ్యత నాది అని హామీ ఇస్తున్నా. సంజయ్‌ని పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించాలని కోరుతున్నా’నన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Renu Desai | దీపావళి వేడుకల్లో రేణూ దేశాయ్.. ‘చంద్రకోర’ తిలకం ధరించి అందరి దృష్టిని ఆకర్షించిన నటి!
Diwali festival | దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం
Bigg Boss Telugu 10 | దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్.. ఎలిమినేషన్ నుంచి సుధీర్‌కు ఊహించని విముక్తి,కన్నీళ్లు పెట్టుకున్న వర్షిణి!
Train collision | ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. ఏడుగరు మృతి 100 మందికి గాయాలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

