కరోనా రోగులకు సీఎం కేసీఆర్ ఆప్యాయ పలకరింపు
సీఎం కేసీఆర్ | గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగులతో ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా మాట్లాడారు. కొవిడ్ వార్డులను కలియతిరిగి రోగులను

హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగులతో ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా మాట్లాడారు. కొవిడ్ వార్డులను కలియతిరిగి రోగులను ఆప్యాయంగా పలుకరించి, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న సీఎం కేసీఆర్.. మీకు నేనున్నాంటూ భరోసా కల్పించి, ధైర్యం చెప్పారు.
ప్రభుత్వ దవాఖానాల్లో కొవిడ్ చికిత్స విధానాన్ని పరిశీలించేందుకు, కరోనా పేషెంట్లకు భరోసానిచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం మధ్యాహ్నం గాంధీ దవాఖానాను సందర్శించారు. గంటపాటు కోవిడ్ పేషెంట్లున్న వార్డులను కలియతిరిగి వారికి అందుతున్న వైద్య చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. గాంధీలో కోవిడ్ పేషెంట్లు చికిత్స పొందుతున్న ఐసీయూ, ఎమర్జెన్సీ, ఔట్ పేషెంట్ వార్డులు సహా, పలు జనరల్ వార్డులలో సీఎం కేసీఆర్ కలియతిరిగారు.
బెడ్ల వద్దకు పోయి అందరి పేషెంట్ల తో నేరుగా మాట్లాడారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పేరు వివరాలు అడిగి తెలుసుకోని మరీ ప్రత్యేకంగా జనరల్ వార్డుల్లోకి కూడా వెళ్లి పేషెంట్లతో మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పారు. మీకు చికిత్స సరిగ్గా అందుతున్నదా అని అడిగి తెలుసుకున్నారు. భోజనం ఎట్లా వున్నదని అడిగారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే విధంగా వైద్యాధికారులకు ఆదేశాలిస్తూ ముందుకు కదిలారు.

ఆక్సిజన్ ప్లాంట్‌ను పరిశీలించిన సీఎం
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానాల్లో ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో, గాంధీలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్‌ను సీఎం కేసీఆర్ పరిశీలించారు. నిమిషానికి రెండు వేల లీటర్ల ఆక్సిజన్‌ను తయారు చేసే ఆక్సిజన్ ప్లాంట్‌ను సీఎం ఆదేశాల మేరకు ఇటీవలే గాంధీ ఆస్పత్రిలో నెలకొల్పారు. ప్లాంట్ మొత్తం కలియతిరిగి, గాంధీ సూపరింటెండెంట్ రాజారావును ప్లాంటు పనిచేసే విధానం గురించి, ఆక్సిజన్ ప్యూరిటీ గురించి అడిగి తెలుసుకున్నారు.

వైద్యులకు అభినందన
ఈ సందర్భంగా గాంధీలో వైద్య సేవలందిస్తున్న కాంట్రాక్టు నర్సులతో, జూనియర్ డాక్టర్లతో సీఎం కేసీఆర్ స్వయంగా మాట్లాడారు. ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు సేవలందిస్తున్నారని వారిని అభినందించారు. వారికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా పరిష్కరిస్తామని, ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రజల కోసం నిలబడాల్సిన అవసరం యువ డాక్టర్లుగా వారి మీద వున్నదని సీఎం అన్నారు. జూనియర్ డాక్టర్లు, నర్సుల సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల కోసం ప్రతిపాదనలను తక్షణమే పంపాలని వైద్య అధికారులను సీఎం ఆదేశించారు.
‘‘క్లిష్ట సమయంలో ప్రజలకు అండగా వుండి బ్రహ్మాండంగా సేవ చేస్తున్నారు. ఈ సేవలను కొనసాగించండి. మీకు ఏ సమస్యవున్నా, అవసరం వున్నా నన్ను సంప్రదించండి. నేను సంపూర్ణంగా మీకు సహకారం అందిస్తాను’’ అని సీఎం కేసీఆర్ వారికి భరోసానిచ్చారు.
ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్ ఎ ఎం రిజ్వీ, సీఎం సెక్రటరీ కోవిడ్ ప్రత్యేక అధికారి రాజశేఖర్ రెడ్డి, సీఎం వోఎస్డీ గంగాధర్, డీఎంఈ రమేశ్ రెడ్డి , గాంధీ సూపరిండెంట్ రాజారావు, పోలీస్ కమీషనర్ అంజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
గాంధీ దవాఖానలోని కోవిడ్ ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న వ్యాధిగ్రస్తులను పరామర్శించిన ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు. pic.twitter.com/ZxolaKvYlm
— Telangana CMO (@TelanganaCMO) May 19, 2021
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

