TS Assembly | నిధుల దారి మళ్లింపు అవాస్తవం.. ప్రతిపక్షాలపై సీఎం కేసీఆర్ ఫైర్
TS Assembly | గ్రామ పంచాయతీ నిధులపై శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ప్రతిపక్షాలు మాట్లాడిన తీరును ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుబట్టారు. గ్రామ పంచాయతీల నిధులు దారి మళ్లింపు అనేది సత్యదూరం అని సీఎం స్పష్టం

హైదరాబాద్ : గ్రామ పంచాయతీ నిధులపై శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ప్రతిపక్షాలు మాట్లాడిన తీరును ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుబట్టారు. గ్రామ పంచాయతీల నిధులు దారి మళ్లింపు అనేది సత్యదూరం అని సీఎం స్పష్టం చేశారు. పంచాయతీరాజ్ చట్టంలో భాగంగానే జీవోలు జారీ చేశామన్నారు. శాసనసభలో సభ్యుల మాటలు వింటుంటే ఆశ్చర్యం కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో జాలి పడాల్సి వస్తుంది. ఏది పడితే అది అడ్డగోలుగా మాట్లాడితే సరికాదు. తెలంగాణలోని సర్పంచ్‌లు దేశంలోనే అత్యంత గౌరవంగా బతుకుతున్నారు. గర్వంగా తల ఎత్తుకునే సర్పంచ్‌లు ఉన్నారంటే మన వాళ్లే. మన సర్పంచ్‌లను కేంద్ర మంత్రులు పలువురు ప్రశంసించారు. కొన్ని సందర్భాల్లో ప్రధాని, నీతి ఆయోగ్ కూడా ప్రశంసించి అనేక అవార్డులు ఇచ్చింది. ముఖ్రా కే గ్రామానికి అవార్డు వచ్చింది. దాదాపు రెండు గంటల పాటు పంచాయతీరాజ్ చట్టం గురించి వివరించడం జరిగింది.
ఎవరి గొంతు నొక్కడం లేదు..
ఎవరూ ఎవరి గొంతు నొక్కడం లేదు. మీరు అద్భుతంగా మాట్లాడండి. మీ కంటే అద్భుతంగా మేం చెప్పగలుగుతాం. మన ఇద్దరి కన్న అద్భుతంగా ప్రజలు గమనిస్తారు. అనేక రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు తమ గ్రామాలు చూసి తన్మయం చెంది పులకించిపోతున్నారు. గత ప్రభుత్వాల హయాంలో సర్పంచ్‌లు బాధ పడ్డ మాట వాస్తవం. ఇవాళ బాధపడటం లేదు. సంతోషంగా ఉన్నారు. గర్వపడుతున్నారు.
కేంద్రం నుంచి వచ్చే నిధులేమీ ఉండవు
కరోనా లాంటి ఇతర సందర్భాల్లో డబ్బులకు ఇబ్బంది వస్తే అవసరం అనుకుంటే శాసనసభ్యులు, మినిస్టర్ల జీతాలు ఆపమన్నాను. కానీ పంచాయతీ గ్రాంట్ రిలీజ్ ఆపొద్దని చెప్పాను. కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తున్నాయో ప్రతిపక్షాలకు తెలియదా? ఫైనాన్స్ ఆఫ్ కమిషన్ ఇండియా చెప్పిన ప్రకారం కేంద్రం నిధులు ఇస్తుంది. ప్రత్యేకంగా కేంద్రం నుంచి వచ్చే నిధులేమి ఉండవు. ఇది వారి అవగాహనలోపం అని అన్నారు. కేంద్రం దయాదాక్షిణ్యాల మీద నిధులు రావు. కొన్ని చోట్ల వనరులు ఉంటాయి. కొన్ని చోట్ల వనరులు ఉండవు. ఏజెన్సీ ఏరియాల్లో భూముల అమ్మకాలు, కొనుగోళ్లు జరగవు. అన్ని గ్రామపంచాయతీలకు సమన్యాయం జరగాలంటే ఏం చేయాలో ఆలోచించాం. మేధావులు, మంత్రివర్గం ఆమోదం తర్వాత పంచాయతీరాజ్ చట్టాన్ని సభ ముందుకు తెచ్చామన్నారు. నిధుల దారి మళ్లింపు అనేది సత్యదూరం అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Alert | మరో తుపాన్ ముప్పు.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన
Promotions Scam | నర్సింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రమోషన్లలో వసూళ్ల దందా.. ఒక్కొక్కరి నుంచి రూ.50 వేలు?
Bharat Summit | కార్మికుల నెత్తురుతో.. సమ్మిట్ సోకులు.. భారత్ సమ్మిట్‌కు ఖర్చు చేసే సొమ్ములో మేజర్ వాటా కార్మిక సంక్షేమ బోర్డుదే!
Balmoor Venkat | ఎమ్మెల్సీ బల్మూరి బల ప్రయోగం.. 20 మంది ప్రాణాలు కాపాడిన బాండీ బీచ్ హీరోకు సొంత రాష్ట్రంలో కష్టాలు
Rythu Runa Mafi | రుణమాఫీకి కుంటిసాకులు.. అర్హత ఉన్నా రైతుకు అందని వైనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

