TS Assembly | భట్టి మాట్లాడుతుంటే ఆశ్చర్యమేస్తోంది.. సీఎం కేసీఆర్ చురకలు
TS Assembly |

హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్కకు సీఎం కేసీఆర్ చురకలంటించారు. సర్పంచ్ల విషయంలో భట్టి మాట్లాడుతుంటే ఆశ్చర్యమేస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో సర్పంచ్‌లను పట్టించుకోలేదు. గ్రామాల్లో అభివృద్ధి జరగలేదు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సర్పంచ్‌లకు స్వేచ్ఛ ఇచ్చి, అన్ని హక్కులు కల్పించామన్నారు.
శాసనసభలో సభ్యులు సత్యదూరమైన విషయాలు మాట్లాడారు అని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. పల్లె, పట్టణ ప్రగతిపై స్వల్పకాలిక చర్చ కాదు.. దీర్ఘకాలిక చర్చ పెట్టండి అని స్పీకర్‌కు సీఎం విజ్ఞప్తి చేశారు. తాము అన్నది తప్పకుండా చేసి చూపిస్తాం. ఏకగ్రీవమైన గ్రామపంచాయతీలకు నిధులు ఇస్తామని ఎక్కడా చెప్పలేదు. నూతన పంచాయతీరాజ్ చట్టంలో ఆ ప్రస్తావనే లేదు. ఆ చట్టం ప్రకారమే నిధుల పంపిణీ, విడుదల జరుగుతుందన్నారు. తమ ప్రభుత్వం పారదర్శకంగా పని చేస్తుంది.
సర్పంచ్‌లకు సర్వ స్వేచ్ఛ ఇచ్చామన్నారు. సర్పంచ్‌లకు అన్ని హక్కులు కల్పించామన్నారు. పన్నులు వసూలు చేసుకునే బాధ్యతను పంచాయతీలకే అప్పగించాం. గత ప్రభుత్వాల హయాంలో పంచాయతీల్లో అవినీతి జరిగింది. గ్రామాల్లో పరిశుభ్రత కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. వర్షాకాలం వచ్చిందంటే గిరిజన ప్రాంతాల్లో మరణాలు సంభవించేవి. ఇప్పుడు అన్ని సీజనల్ వ్యాధులు, డెంగీ లాంటి విషజ్వరాలు తగ్గిపోయాయి. గ్రామాల రూపురేఖలను మార్చేశామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
Army Officer Wife | చైనా ఏజెంట్లకు సున్నిత సమాచారం.. సైనికాధికారి భార్యపై ఎఫ్ఐఆర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

