CM KCR | కాంగ్రెస్ పార్టీ భుజం మీద గొడ్డలి పెట్టుకుని రెడీగా ఉంది : సీఎం కేసీఆర్
CM KCR | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పెద్ద ప్రమాదం పొంచి ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఆ పార్టీ తన భుజం మీద గొడ్డలి పెట్టుకుని రెడీగా ఉందని, రైతులకు మళ్లీ కష్టాలు తీసుకొస్తదని కేసీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల కేంద్రంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
CM KCR | రాజన్న సిరిసిల్ల : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పెద్ద ప్రమాదం పొంచి ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఆ పార్టీ తన భుజం మీద గొడ్డలి పెట్టుకుని రెడీగా ఉందని, రైతులకు మళ్లీ కష్టాలు తీసుకొస్తదని కేసీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల కేంద్రంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ఇవాళ ఎక్కడా చూసినా పచ్చటి పంట పొలాలతో ఒక బెత్తడి జాగా ఖాళీ లేకుండా వరి నాట్లు కనడబుతున్నాయని కేసీఆర్ తెలిపారు. ఇది చాలా సంతోషం. మూడు కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించే నా తెలంగాణ బిడ్డలు.. సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో, వచ్చే ప్రభుత్వంలో సన్నబియ్యం ఇవ్వాలని మేనిఫెస్టోలో పెట్టుకున్నామని కేసీఆర్ తెలిపారు.
అబద్దాలు, మోసపు మాటలతో, ఆపద మొక్కులు మొక్కుతూ వచ్చే వారుంటారు.. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని కేసీఆర్ సూచించారు. కేటీ రామారావు గుణమేందో. గణమేందో మీకే ఎక్కువ తెలుసు. ఇక్కడ రావాల్సినవి వచ్చాయి. గొప్ప విద్యాకేంద్రంగా తీర్చిదిద్దుతాం. నీళ్లు పుష్కలంగా వచ్చాయి. అన్ని హంగులు సిరిసిల్ల ప్రాంతానికి ఏర్పడే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఆపద మొక్కులు మొక్కే వారు చాలా మంది వస్తుంటారు. ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉన్నది. రైతు సోదరులను హెచ్చరిస్తున్నా. మూడు సంవత్సరాలు రాత్రింబవళ్లు కష్టపడి ధరణి పోర్టల్ తీసుకొచ్చాం. రైతుల భూములు క్షేమంగా ఉండాలి. కౌలుకు ఇచ్చినంత మాత్రాన ఇంకోకరి పరం కావొద్దు అని ధరణిని తీసుకొచ్చాం. రిజిస్ట్రేషన్లు పావుగంటలో అయిపోతున్నాయి. ధరణి వల్ల 98 శాతం మంది రైతులకు మేలు జరిగింది. కాంగ్రెస్ పార్టీ భుజం మీద గొడ్డలి పెట్టుకుని రెడీగా ఉంది. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ కూడా ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ధరణిని తీసి బంగాళాఖాతంలో విసిరేస్తారట. మళ్లీ వీఆర్వోలు, గిర్దావర్లు వాని భూమి వీనికి రాసి, వాని భూమి ఇంకోకరికి రాసి, మళ్లీ రైతులను కోర్టుల చుట్టు తిప్పే పరిస్థితి వస్తుంది. మీ మీద వీఆర్వో, గిర్డారవ్, డిప్యూటీ తహసీల్దార్, తహసీల్దార్, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్, జిల్లా కలెక్టర్, రెవెన్యూ సెక్రటరీ, సీసీఎల్ఏ, రెవెన్యూ మంత్రి ఉండేవారు. వీరిలో ఒకరికి కోపమొచ్చినా రైతు భూమి ఆగమయ్యేది. కానీ ఇవాళ ఆ అధికారం తీసేసి రైతులకే అధికారం ఇచ్చాం. మీ బొటన వేలి ప్రమేయం లేకుండా.. భూమి ఇతరులకు పోయే అవకాశం లేదు. మీ భూమి హక్కులు మీ బొటనవేలితోనే మారుతాయి. ఈ సిగ్గుమాలిన కాంగ్రెస్ మాటలు నమ్మకండి.. ఇవాళ ధరణి పుణ్యం వల్ల పల్లెలు ప్రశాంతంగా ఉన్నాయి. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్న ప్రమాదం వచ్చి నెత్తిన పడుతది. మళ్లీ కథ మొదటికి వస్తది.. చాలా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను. అనేక రంగాల్లో.. మనం నంబర్‌వన్‌గా ఉన్నాం అని కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana Box Office | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణం’ సునామీ.. వారం రోజుల్లోనే రూ.934 కోట్ల వసూళ్లు!
Vakiti Srihari | తాగేందుకు, వంటకూ రూ.20 ఫిల్టర్ డబ్బా నీళ్లే.. మంత్రి వాకిటి శ్రీహరి ఇలాఖాలో నీటి కష్టాలపై మహిళ.. వీడియో
RSS Chief Mohan Bhagwat: ఒకప్పుడు క్రాకర్స్‌తో గాలి శుభ్రమయ్యేది: ఆర్ఎస్ఎస్ చీఫ్
భోజనం చేద్దామన్నఎమ్మెల్యే బీర్ల ఐలయ్య.. ధాన్యం కొంటే చాలు..! నేనే 10 మందికి పెడతానని రైతు సమాధానం : వీడియో
Suriya | కోలీవుడ్‌లో సూర్య సరికొత్త చరిత్ర.. మూడు సినిమాలతో రూ.800 కోట్ల మైలురాయి!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

