ఆహార భద్రతా దినోత్సవం..రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు

హైదరాబాద్: ‘‘ ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం’’ (జూన్ 7) సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆహారం కోసం అలమటించిన తెలంగాణ నేడు దేశానికే అన్నపూర్ణగా మారడం వెనక రాష్ట్ర ప్రభుత్వ కృషిని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అనతికాలంలో రెండు పంటలకు రెండుకోట్ల ఎకరాల మాగాణాగా తెలంగాణను తీర్చిదిద్దుకున్నామని సీఎం అన్నారు. దాదాపు మూడు కోట్ల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యం ఉత్పత్తితో, దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలోకి ఎదుగుతున్నదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం, ఆహార భద్రత ను దాటి దేశానికి ఆహార భరోసాను కల్పించే స్థితికి చేరుకున్నదన్నారు.
‘‘రైస్ బౌల్ ఆఫ్ ఇండియా’’ గా తెలంగాణ వ్యవసాయం రూపుదిద్దుకోవడం పట్ల సీఎం కేసీఆర్ ఆనందం వ్యక్తం చేశారు.ఉమ్మడి రాష్ట్రంలోని పాలకులు తెలంగాణ వ్యవసాయాన్ని, నీటిపారుదల రంగాన్ని నిర్లక్ష్యం చేయడం మూలంగా.. సాగునీరు, తాగునీరు లేక, తెలంగాణ అల్లాడిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్న అనంతరం మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పటిష్టం చేసుకుని, కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టులను యుద్దప్రాతిపదికన నిర్మించుకుని నేడు ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఎదుగుతుండడం, తెలంగాణ సమాజం గర్వపడే సందర్భమన్నారు.దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనివిధంగా ప్రతి ఏటా రూ.45 వేల కోట్లతో వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, ప్రజలకు ఆహార భద్రతతోపాటు సామాజిక జీవన భద్రత కూడా ప్రభుత్వం కల్పిస్తున్నదని సీఎం అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో తిండికి లోటు ఉండకూడదనే లక్ష్యంతో, ఆహార భద్రతను కల్పించడంలో భాగంగా, ఒక వ్యక్తికి నెలకు 6 కిలోల చొప్పున, కుటుంబంలోని ప్రతి ఒక్కరికి కిలో రూపాయి చొప్పున ‘‘ ఆహార భద్రతా కార్డు (రేషన్ కార్డు)’’ ద్వారా నాణ్యమైన బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. రేషన్ కార్డు కలిగిన మొత్తం 87,41,000 కుటుంబాల్లోని 2,79,27,000 ( రాష్ట్ర జనాభాలో 72శాతం) మందికి కేవలం 1 రూపాయికి కిలో చొప్పున 20 లక్షల మెట్రిక్ బియ్యాన్ని సాలీనా పంపిణీ చేస్తున్నదని సీఎం తెలిపారు. ఇందుకు గాను కిలో ఒక్కంటికి రూ.28.24 పైసల చొప్పున ప్రతి ఏటా రూ.2,088 కోట్ల సబ్సిడీని భరిస్తున్నదన్నారు. రాష్ట్రం వ్యాప్తంగా విద్యార్ధులకు సన్నబియ్యాన్ని అందిస్తూ ఆహార భద్రతను ప్రభుత్వం కల్పిస్తున్నదని సీఎం కేసీఆర్ వివరించారు. రేషన్ కార్డుదారులు ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పోర్టబిలిటీ రూపొందించిందన్నారు. తద్వారా తెలంగాణ పౌరులు రాష్ట్రంలో ఎక్కడున్నా ఆహార భద్రత లభించే ఏర్పాటును ప్రభుత్వం చేసిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై క్రేజీ అప్డేట్.. దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠకే, జనవరి చివరి నుంచి షూటింగ్..
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

