దేశాన్ని ఉన్మాద స్థితిలోకి నెట్టేస్తున్నారు : సీఎం కేసీఆర్
హైదరాబాద్ : స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్తయినప్పటికీ.. పేదల ఆశలు నెరవేరలేదు.. అనేక వర్గాల ప్రజలు తమకు స్వతంత్ర ఫలాలు సంపూర్ణంగా అందట్లేదనే ఆవేదన మనకు కనబడుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. వాటన్నింటిని విస్మరించి ఈ దేశాన్ని ఉన్మాద స్థితిలోకి నెట్టివేసేందుకు కుటిల ప్రయత్నాలు జరగడాన్ని మనమంతా చూస్తున్నాం. మౌనం వహించడం సరికాదు. అర్థమైన తర్వాత కూడా అర్థం కానట్టు ప్రవర్తించడం మేధావుల లక్షణం కాదు. ధీరోదాత్తులు, మేధావులు, వైతాళికులు కరదీపికలుగా మారి ఏ సమాజాన్ని అయితే సక్రమమైన మార్గంలో నడిపిస్తారో ఆ సమాజం గొప్పగా పురోగమించే అవకాశం ఉంటుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
గాంధీ గురించి ఈ తరం పిల్లలకు తెలియాలి
మన దేశంలో మన రాష్ట్రానిది ఒక ప్రత్యేకమైన స్థానం. స్వతంత్ర భారత స్ఫూర్తిని ఈ తరం పిల్లలకు, యువకులకు తెలియని వారికి విస్తృతంగా తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపట్టామని సీఎం తెలిపారు. అన్నింటిని మించి ప్రారంభోత్సవ కార్యక్రమంలో తాను చెప్పినట్లు విశ్వజనీనమైన సిద్ధాంతాన్ని, అహింసా వాదాన్ని, ఎంతటి శక్తిశాలులైనా సరే శాంతియుత ఉద్యమాలతో జయించొచ్చని ప్రపంచ మానవాళికి సందేశం ఇచ్చిన మహ్మత్ముడు పుట్టిన గడ్డ మన భారతావని. అటువంటి దేశంలో గాంధీ గురించి, ఆయన యొక్క ఆచరణ గురించి, స్వాతంత్య్ర పోరాటంలో ఉజ్వలంగా వారు నిర్వహించిన పాత్ర గురించి ఈతరం పిల్లలకు తెలియాల్సిన అవసరం ఉందని కేసీఆర్ స్పష్టం చేశారు.
మహనీయులకు శిరసు వంచి జోహర్లు ఆర్పిస్తున్నాను..
ప్రాణ, ఆస్తి త్యాగాలు, అమూల్యమైన జీవితాలు త్యాగం చేస్తే, ఎన్నో బలిదానాలు చేస్తే ఈ స్వాతంత్య్రం వచ్చింది. స్వేచ్ఛా భారతంలో స్వేఛ్చా వాయువులు పీలుస్తున్నాం. 75 ఏండ్లుగా జరుగుతున్న విషయాలను మరోసారి సింహవలోకనం చేసుకోని ముందుకు పురోగమించాల్సినటువంటి పద్ధతులను ఆలోచించుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. ఈ దేశాన్ని స్వేచ్ఛా వాయువులతో ఉండే విధంగా.. స్వతంత్ర దేశంగా మార్చేందుకు ఎందరో మహనీయులు త్యాగాలు చేశారు. వారందరికీ శిరసు వంచి వినమ్రపూర్వకంగా జోహార్లు ఆర్పిస్తున్నాను. ఘన నివాళులర్పిస్తున్నానని కేసీఆర్ పేర్కొన్నారు.
మేధావులు కరదీపికలుగా మారాలి..
పేదల ఆశలు నెరవేరడటం లేదు. అడుగు వర్గాల ప్రజల్లో ఆక్రోశం ఇంకా వినిపిస్తుంది. అనేక వర్గాల ప్రజలు తమకు స్వతంత్ర ఫలాలు సంపూర్ణంగా అందట్లేదని ఆవేదన మనకు కనబడుతుందని కేసీఆర్ తెలిపారు. వాటన్నింటిని విస్మరించి దేశాన్ని ఉన్మాద స్థితిలోకి నెట్టివేసేందుకు కుటిల ప్రయత్నాలు జరగడాన్ని మనమంతా చూస్తున్నాం. మౌనం వహించడం సరికాదు. అర్థమైన తర్వాత కూడా అర్థం కానట్టు ప్రవర్తించడం మేధావుల లక్షణం కాదు. ధీరోదాత్తులు, మేధావులు, వైతాళికులు కరదీపికలుగా మారి ఏ సమాజాన్ని అయితే సక్రమమైన మార్గంలో నడిపిస్తారో ఆ సమాజం గొప్పగా పురోగమించే అవకాశం ఉంటది. అద్భుతమైన ప్రకృతి సంపదతో, ఖనిజ సంపదతో యుశక్తితో, మానవసంపత్తితో ఉన్న ఈ దేశం పురోగమించడం లేదు. స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితో ఉజ్వలమైన రీతిలో ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మనందరిపై ఉంది. ఈ క్రమంలోనే ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమం నిర్వహించుకున్నాం. గ్రామాల్లో, పట్టణాల్లో స్వతంత్ర ఉద్యమంపై చర్చ జరిగిందని కేసీఆర్ పేర్కొన్నారు.
సామూహిక జాతీయ గీతాలాపన రాష్ట్రానికి గర్వకారణం
సామూహిక జాతీయ గీతాలాపన చేయాలంటే సుమారు కోటి మంది పాల్గొన్నారు. ఏకకాలంలో ఆలపించడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం అని సీఎం పేర్కొన్నారు. మహాత్ముడు విశ్వమానవుడు. కొందరు అల్పులు నీచంగా మాట్లాడుతున్నారు. ఆయన గొప్పతనాన్ని యూఎన్వో ప్రశంసించింది. అంతర్జాతీయంగా ఏ దేశానికి వెళ్లిన ఇండియా అంటే యూ ఆర్ గ్రేట్ అని పొగడ్తల వర్షం కురిపిస్తుంటూరు. గాంధీ గారి జీవిత విశేషాలు, విగ్రహాలు.. విదేశాల్లో ఉన్నాయంటే భారతదేశానికి గర్వకారణం అని చెప్పారు.
గాంధీ సినిమాను 22 లక్షల మంది పిల్లలు చూశారంటే 10 శాతం మందికి స్ఫూర్తి కలిగిన కూడా ఈ దేశం బాగా పురోగమించడానికి వారి శక్తిసామర్థ్యాలు వినియోగిస్తున్నారని నమ్ముతున్నాను. ఇటువంటి స్ఫూర్తి ముందు కూడా కొనసాగాలి. గాంధీ మార్గంలో దేశం పురోగమించాలి. అహింసా సిద్ధాంతాన్ని ఉపయోగించుకొని తెలంగాణ సాధించాం. ఏ విధంగా పురోగమిస్తున్నామో మనకు తెలుసు. చాలా గొప్పగా కార్యక్రమాలు నిర్వహించిన అందరికీ, అలరించిన కళాకారులకు ధన్యవాదాలు తెలుపుతున్నానని కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

