హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): టీ హబ్‌లో క్లీన్ ఎనర్జీ హ్యాకథాన్ నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. నుమాలిగల్ రిఫైనరీ లిమిటెడ్‌తో కలిసి ఈ హ్యాకథాన్‌ను జనవరి 22, 23న నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఇందుకోసం ఆసక్తి ఉన్నవారు https://bit.ly/3v0lUeE లింకు ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, హ్యాకథాన్‌లో విజేతగా నిలిచిన వారికి రూ.5లక్షల వరకు నగదు బహుమతి ప్రదానం చేస్తామని చెప్పారు.