దేవరకద్ర రూరల్, ఏప్రిల్ 27: బీజేపీలో వర్గపోరు భగ్గుమన్నది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి పాదయాత్రకు సంబంధించిన పోస్టర్లలో ఫొటోల విషయంలో ఇరువర్గాలు దాడి చేసుకొన్నాయి. దాడిలో పార్టీ భూత్పూ ర్ మండల అధ్యక్షుడికి తీవ్రగాయాలయ్యాయి. ఎస్సై భగవంత్‌రెడ్డి కథనం మేరకు.. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం పరిధిలోని భూత్పూర్ బీజేపీ మండలాధ్యక్షుడు బాల్‌రెడ్డి దేవరకద్ర పట్టణం లో బండి సంజయ్ యాత్రకు సంబంధించిన వాల్‌పోస్టర్లు అతికిస్తున్నాడు. వాల్‌పోస్టర్లలో ఫొటోల విషయంలో బాల్‌రెడ్డితో బీజేపీ దేవరకద్ర మండలాధ్యక్షుడు కొండ అంజన్‌కుమార్‌రెడ్డి ఘర్షణకు దిగా డు. దేవరకద్రలోని ఆర్వోబీ కింద ఇరువర్గాలు పరస్పర దాడి చేసుకున్నాయి. దాడిలో బాల్‌రెడ్డి తలకు, చేతికి బలమైన గాయాలయ్యా యి. అంజన్‌కుమార్‌రెడ్డి కి స్వల్ప గాయాలయ్యా యి. కమలం పార్టీకి చెందిన ఇద్దరు మండల అధ్యక్షులు వీధి పోరాటానికి దిగడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.