నేడు రామప్ప ఆలయాన్ని సందర్శించనున్న సీజేఐ
Justice nv ramana | సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (Justice nv ramana) రెండు రోజులపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు.

హైదరాబాద్: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (Justice nv ramana) రెండు రోజులపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. నేడు ములుగు జిల్లాలోని రామప్ప గుడితోపాటు, రామప్ప చెరువును జస్టిస్ రమణ దంపతులు సందర్శించనున్నారు. ఇవాళ రాత్రికి హనుమండలోని ఎన్ఐటీ అతిథిగృహంలో బస చేస్తారు. రాత్రి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే విందుకు హాజరవుతారు.
ఆదివారం ఉదయం భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుంటారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య హనుమకొండలోని కోర్టుల సముదాయాన్ని ప్రారంభిస్తారు. రూ.22 కోట్ల వ్యయంతో పది కోర్టుల భవనం నిర్మించారు. అదేరోజు సాయంత్రం షామీర్పేటలోని నల్సార్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొంటారు. సోమవారం తిరిగి ఢిల్లీకి వెళ్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

