ఏసీబీ వలలో సివిల్ సప్లయ్ ఆఫీసర్
మహబూబాబాద్ జిల్లా మేనేజర్‌పై అక్రమ ఆస్తుల ఆరోపణలు.. ఏడు ప్రాంతాల్లో తనిఖీలు.. రూ. 9.41 కోట్ల ఆస్తుల గుర్తింపు.. మార్కెట్ విలువ 60 కోట్లపైనే..
హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): మహబూబాబాద్ జిల్లా సివిల్ సప్లయ్ శాఖలో పనిచేస్తున్న జిల్లా మేనేజర్ (టెక్నికల్) వీ నరసింహారావుకు సంబంధించిన ఆదాయానికి మించిన ఆస్తులను ఏసీబీ గుర్తించింది. ప్రాథమిక సోదాల్లో ఇప్పటివరకు సుమారు రూ.9.41 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను గుర్తించినట్టు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. ఈ ఆస్తుల వాస్తవ మారెట్ విలువ దాదాపు రూ.60 కోట్ల వరకూ ఉండొచ్చని ఏసీబీవర్గాలు తెలిపాయి. నరసింహారావు గతంలో ఖమ్మం కలెక్టరేట్లో విధులు నిర్వహించారు. ఆయన అక్రమమార్గాలు, అనుమానాస్పద పద్ధతుల ద్వారా ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు రావడంతో ఏసీబీ కేసు నమోదు చేసింది.
అవినీతి నిరోధక చట్టం-1988లోని సెక్షన్ 13(1)(బి), 13(2) కింద కేసు దర్యాప్తు చేపట్టింది. నరసింహారావు, ఆయన కుటుంబసభ్యులు, సంబంధిత వ్యక్తులకు చెందినట్టు గుర్తించిన ఆస్తులపై శుక్రవారం ఉదయం ఏడు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. పలు స్థిరాస్తులు, వాహనాలు, బంగారు, వెండి ఆభరణాలు, గృహోపకరణాలకు సంబంధించిన వివరాలను సేకరించారు. ఖమ్మం జిల్లాలోని బల్లేపల్లి, రఘునాథపాలెం, వెలుగుమట్ల ప్రాంతాల్లో మొత్తం 1,230.16 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఓపెన్ ప్లాట్లను గుర్తించారు.
ఇవి నరసింహారావు, ఆయన భార్య పేర్లపై ఉన్నట్టు ఏసీబీ వెల్లడించింది. వీటి డాక్యుమెంట్ /రిజిస్ట్రేషన్ విలువ రూ.30.72 లక్షలుగా పేరొన్నది. సూర్యాపేట జిల్లాలోని సిరికొండలో 21.3 ఎకరాలు, మోతె మండలంలో 5.31 ఎకరాలు, సూర్యాపేట మండలం నామవరం గ్రామంలో 5.31 ఎకరాల చొప్పున రెండు భూములు, అలాగే సూర్యాపేట మండలంలోని కల్మల చెరువు వద్ద సుమారు 1.08 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్టు గుర్తించారు. నామవరం భూముల్లో ఒకటి నరసింహారావు పేరుపై, మరొకటి ఆయన మామ పేరుపై ఉన్నట్టు ఏసీబీ పేరొన్నది.
ఖమ్మంలో మూడు భవనాలు..
ఖమ్మంలోని కవిరాజ్‌నగర్‌లో జీ+2 భవ నం, జీ+4 భవనం.. అలాగే సాగర్ ఎన్క్లేవ్, బైరామల్‌గూడ, ఎల్బీనగర్ ప్రాంతాల్లో కొన్ని భవనాలు ఉన్నట్టు ఏసీబీ వివరాలు సేకరించింది. ఈ మూడు నిర్మాణాల మొత్తం డాక్యుమెంట్ విలువ రూ.1.58 కోట్లుగా వెల్లడించింది. వీటిలో కొన్ని ఆస్తులు నరసింహారావు, ఆయన భార్య, మామ పేర్లపై ఉన్నట్టు ప్రకటనలో పేరొన్నది. సోదాల సందర్భంగా క్రెటా కారు, టీవీఎస్, యాక్టివా వాహనాలను స్వా ధీనం చేసుకున్నారు. రూ.33.48 లక్షల విలువైన గృహోపకరణాలు, 360.97 గ్రాముల బంగారం, 331.58 గ్రాముల వెండి ఆభరణాలు గుర్తించారు. నరసింహారావు బినామీ పేరుతో రైస్‌మిల్ కొనుగోలు చేసినట్టు అనుమానిస్తున్న అధికారులు, యాజమాన్యం, పెట్టుబడుల మూలాలపై విచారణ చేపట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

