CEO Vikas Raj | కౌంటింగ్ రోజు ర్యాలీలకు అనుమతి లేదు.. స్పష్టం చేసిన సీఈవో వికాస్ రాజ్
CEO Vikas Raj | ఈ నెల 4న ఉదయం 8 గంటలకు లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలవుతుందని సీఈవో వికాస్ రాజ్ వెల్లడించారు. మొదట పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపు ఉంటుందని.. 8.30 గంటలకు ఈవీఎంల ఓట్ల లెక్కింపు షురూ అవుతుందని ప్రకటించారు.
CEO Vikas Raj | ఈ నెల 4న ఉదయం 8 గంటలకు లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలవుతుందని సీఈవో వికాస్ రాజ్ వెల్లడించారు. మొదట పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపు ఉంటుందని.. 8.30 గంటలకు ఈవీఎంల ఓట్ల లెక్కింపు షురూ అవుతుందని ప్రకటించారు. హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రాల వద్ద నాలుగు అంచెల భద్రత ఉంటుందని పేర్కొన్నారు. కౌంటింగ్ కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకువెళ్లేందుకు అనుమతి ఉండదని సీఈవో స్పష్టం చేశారు.
అలాగే, కౌంటింగ్ ఏజెంట్లు, సిబ్బందికి సైతం సెల్‌ఫోన్స్ అనుమతి ఉండవని తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలోని ప్రతి మూలను కవర్ చేసేలా సీసీ కెమెరాల నిఘా ఉంటుందని.. స్ట్రాంగ్ రూం నుంచి లెక్కింపు కేంద్రం వరకు బారికేడ్లు, పటిష్ఠ భద్రత ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2.17 లక్షల పోస్టల్ బ్యాలెట్స్ వచ్చాయని చెప్పారు. ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు 276 టేబుల్స్‌ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో అత్యధికంగా 24 రౌండ్లలో లెక్కింపు ఉంటుందని.. మరో మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో అత్యల్పంగా 13 రౌండ్ల లెక్కింపు వికాస్ రాజ్ తెలిపారు.
ఓట్ల లెక్కింపులో దాదాపు 10వేలమంది సిబ్బంది పాల్గొంటారని.. సెగ్మెంట్ల వారీగా ఓట్ల లెక్కింపు సిబ్బందిని ర్యాండమ్‌గా కేటాయిస్తామన్నారు. లెక్కింపు రోజు ఉదయం 5 గంటలకు మరోసారి ర్యాండమ్‌గా సిబ్బందిని కేటాయిస్తామని చెప్పారు. 2400పైగా మైక్రో అబ్జర్వర్లు కౌంటింగ్‌లో పాల్గొంటారని చెప్పారు. కౌంటింగ్ రోజున మద్యం దుకాణాలు బంద్ ఉంటాయని.. అలాగే ర్యాలీలకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ర్యాలీలకు పోలీసులు అనుమతి ఇస్తే చేసుకోవచ్చునన్నారు. శనివారం సాయంత్రం 6.30 గంటల నుంచి ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసుకోవచ్చన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

