హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో సోమవారం నుంచి మూడు రోజులపాటు కామన్ వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (సీపీఏ) సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఆదివారం బయలుదేరి వెళ్లింది.
ఈ బృందంలో డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, అసెంబ్లీ కార్యదర్శి వీ నరసింహాచార్యులు, చైర్మన్ ఓఎస్డీ గోవర్ధన్‌రెడ్డి ఉన్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు నిర్వహిస్తున్న తీరు, ఉభయ సభల్లో అనుసరించాల్సిన పద్ధతులు, సభలు చేసిన చట్టాలతో ఒనగూరిన ప్రయోజనాలు తదితర అంశాలపై గుత్తా ప్రసంగించనున్నారు.