TGPSC | వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ పోస్టులకు జులై 4 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్
TGPSC | రాష్ట్రంలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించి టీజీపీఎస్సీ కీలక ప్రకటన విడుదల చేసింది. జులై 4 నుంచి 8వ తేదీ వరకు టీజీపీఎస్సీ కార్యాలయంలో ఎంపిక చేసిన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతుందని ప్రకటనలో పేర్కొన్నారు.
TGPSC | హైదరాబాద్ : రాష్ట్రంలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించి టీజీపీఎస్సీ కీలక ప్రకటన విడుదల చేసింది. జులై 4 నుంచి 8వ తేదీ వరకు టీజీపీఎస్సీ కార్యాలయంలో ఎంపిక చేసిన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతుందని ప్రకటనలో పేర్కొన్నారు. 4వ తేదీ నుంచి 8 వరకు ప్రతి రోజు ఉదయం 10.30 గంటలకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. జులై 3వ తేదీ నుంచి ఆప్షన్స్‌కు అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితా టీజీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉందన్నారు.
గతేడాది జులై నెలలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి రాత పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షను హైదరాబాద్‌లోని రెండు కేంద్రాల్లో నిర్వహించారు. క్లాస్-ఏలో 170, క్లాస్-బీలో 15 ఉద్యోగాలకు 1,172 మంది దరఖాస్తు చేసుకొన్నారు. క్లాస్-ఏ ఉద్యోగాలకు ఉదయం పేపర్-1 పరీక్షకు 835 మంది హాజరయ్యారు. పేపర్-2ను 810 మంది రాశారు. క్లాస్-బీ ఉద్యోగాల నియామక పరీక్షకు 103 మంది హాజరయ్యారు.
Harish Rao | సాయిచంద్ ఆ పాట పాడితే కన్నీళ్లు వచ్చేవి.. మాజీ మంత్రి హరీశ్‌రావు భావోద్వేగ ప్రసంగం
TTD EO | టీటీడీ ఆన్లైన్ అప్లికేషన్లకు ఆధార్ లింక్‌తో దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట : టీటీడీ ఈవో
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

