Lok Sabha Polls | తెలంగాణలో 65.67శాతానికి పోలింగ్.. వివరాలు వెల్లడించిన సీఈవో వికాస్‌రాజ్
Lok Sabha Polls | తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ శాతం 65.67శాతానికి పెరిగింది. తుది పోలింగ్ వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ వెల్లడించారు. అత్యధికంగా భువనగిరిలో 76.78శాతం పోలింగ్ నమోదైందని.. అత్యల్పంగా హైదరాబాద్‌లో 48.48శాతం నమోదైనట్లు ప్రకటించారు.
Lok Sabha Polls | తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ శాతం 65.67శాతానికి పెరిగింది. తుది పోలింగ్ వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ వెల్లడించారు. అత్యధికంగా భువనగిరిలో 76.78శాతం పోలింగ్ నమోదైందని.. అత్యల్పంగా హైదరాబాద్‌లో 48.48శాతం నమోదైనట్లు ప్రకటించారు. నర్సాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో అత్యధికంగా 84.25శాతం, మలక్‌పేట అసెంబ్లీ సెగ్మెంట్లో అత్యల్పంగా 42.76శాతం నమోదైందని చెప్పారు. 2019 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే 3శాతం పోలింగ్ పెరిగిందన్నారు.
జూన్ 4న 34 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపును నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్‌లో 47.03శాతం, చేవెళ్లలో 56.40, కరీంనగర్లో 72.54, ఖమ్మంలో 76.09శాతం, మహబూబాబాద్‌లో 72.43శాతం, మల్కాజ్‌గిరిలో 50.78శాతం, మెదక్‌లో 75.09శాతం, నాగర్ కర్నూల్లో 69.46శాతం, నల్గొండలో 74.02శాతం, నిజామాబాద్‌లో 71.92శాతం, పెద్దపల్లిలో 67.87శాతం, సికింద్రాబాద్‌లో 49.04శాతం, వరంగల్‌లో 68.86శాతం, జహీరాబాద్‌లో 74.63శాతం పోలింగ్ నమోదైందని సీఈవో వికాస్ రాజ్ వివరించారు. ఇక కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో 51.61శాతం పోలింగ్ నమోదైందని వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

