Railway Budget | రైల్వే బడ్జెట్లోనూ తెలంగాణకు మొండిచెయ్యే.. ఏపీకి అధిక కేటాయింపులు
రైల్వే బడ్జెట్లోనూ తెలంగాణకు మొండి చెయ్యి చూపారు. రాష్ట్ర విభజన చట్ట ప్రకారం కాజీపేటలో ఏర్పాటు చేయాల్సిన కోచ్ ఫ్యాక్టరీ గురించి కనీసం మాటమాత్రంగానైనా ప్రస్తావించలేదు.
- రాష్ర్టానికి అరకొర నిధులతో సరి
- కోచ్ ఫ్యాక్టరీ ఊసెత్తని కేంద్రం
Railway Budget | హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): రైల్వే బడ్జెట్లోనూ తెలంగాణకు మొండి చెయ్యి చూపారు. రాష్ట్ర విభజన చట్ట ప్రకారం కాజీపేటలో ఏర్పాటు చేయాల్సిన కోచ్ ఫ్యాక్టరీ గురించి కనీసం మాటమాత్రంగానైనా ప్రస్తావించలేదు. దేశవ్యాప్తంగా రైల్వేలకు కేటాయించిన రూ.2,62,000 కోట్లలో తెలంగాణలోని ప్రాజెక్టులకు ఏమిస్తున్నదీ చెప్పలేదు. నిరుడు ఫిబ్రవరిలో ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్లో తెలంగాణకు రూ.5,071 కోట్లు మాత్రమే కేటాయించిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు పూర్తిస్థాయి రైల్వే బడ్జెట్లో కూడా తెలంగాణ కు అన్యాయం చేసింది. కేవలం రూ.5,336 కోట్ల కేటాయింపుతో సరిపుచ్చారు. తెలంగాణలో రైల్వే నెట్వర్క్ విద్యుదీకరణ పనులను 100 శాతం పూర్తి చేశామని, రాష్ట్రంలోని 437 ఆర్వోబీలు, ఆర్‌యూబీలను నిర్మించామని, 40 స్టేషన్లను అమృత స్టేషన్లుగా అభివృద్ధి చేయనున్నామని రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ బుధవారం ఢిల్లీ నుంచి వర్చువల్‌గా నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. రాష్ట్రంలో కొత్తగా చేపట్టిన రైల్వే ట్రాకుల నిర్మాణానికి రూ.32,946 కోట్ల ఖర్చవుతుందని తెలిపారు.
ఏపీకి అధిక నిధులు
ఏపీలో రైల్వేల అభివృద్ధికి మధ్యంతర బడ్జెట్లో రూ.9,138 కోట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్లో మరో రూ.9,151 కోట్లు కేటాయించింది. ఇప్పటికే 73 కొత్త రైల్వే లైన్లు పూర్తి చేశామని, 73 స్టేషన్లను అమృత స్టేషన్లుగా అభివృద్ధి చేశామని అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. ఏపీలో రూ.73,743 కోట్ల విలువైన 41 ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నట్టు చెప్పారు. సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్, సీపీఆర్వో ఏ శ్రీధర్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి వేడుకల్లో మార్పులు.. నవంబర్ 21న గ్రాండ్ రిసెప్షన్!
Hyderabad | హైదరాబాద్‌లో జలగలు.. అక్రమ బోర్లతో యథేచ్ఛగా ట్యాంకర్లతో నీటి వ్యాపారం!
Section 22A | కదలని 22ఏ ఫైళ్లు.. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనే మూలుగుతున్న దరఖాస్తులు
Prabhas | బాక్సాఫీస్ నుంచి గ్లోబల్ మార్కెట్ వరకు.. ప్రభాస్ క్రేజ్‌కు ఇదే నిదర్శనం!
Bhu Bharati | సర్వర్ డౌన్.. ఓటీపీలు రావు.. భూ భారతి సేవలతో రైతుల అవస్థలు
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

