ఉద్దేశపూర్వకంగానే విద్యారంగం నిర్వీర్యం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నదని సీపీఎం నేత, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ ధ్వజమెత్తారు.
- ఆర్ఎస్ఎస్ చెప్పుచేతల్లో కేంద్రం
- నూతన జాతీయ విద్యావిధానంతో విభజన తత్వం
- సీపీఎం నేత, త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్ ఆగ్రహం
హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నదని సీపీఎం నేత, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ ధ్వజమెత్తారు. పేదలకు విద్యను దూరం చేసి కార్పొరేట్ శక్తులకు సంపదలు కట్టబెడుతున్నదని మండిపడ్డారు. విశ్వవిద్యాలయాల్లోకి ఆర్ఎస్ఎస్ శక్తులు ప్రవేశించి విద్యార్థి సంఘాల నాయకులపై దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎస్ఎఫ్ఐ 17వ జాతీయ మహాసభల సందర్భంగా సోమవారం హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాణిక్ సర్కార్ ప్రసంగించారు.
బీజేపీ తీసుకొచ్చిన నూతన విద్యావిధానం స్వార్థం, విభజన తత్వాన్ని పెంపొందిస్తుందని ఆరోపించారు. స్వాతంత్య్ర పోరాట చరిత్రను కేంద్రంలోని బీజేపీ సర్కార్ వక్రీకరిస్తున్నదని విరుచుకుపడ్డారు. దేశ ప్రయోజాలకు భిన్నంగా ఆర్ఎస్ఎస్ చెప్పుచేతల్లో బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని దుయ్యబట్టారు. జాతీయ నూతన విద్యావిధానానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు. దేశంలో నిరుద్యోగ సమస్య భయంకరంగా ఉన్నదని, కనీసం ఖాళీగా ఉన్న ఉద్యోగాలను కూడా భర్తీ చేయడం లేదని ధ్వజమెత్తారు.సభలో ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు వీపీ సానూ, ప్రధాన కార్యదర్శులు మయూక్ బిశ్వాస్, రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎల్ మూర్తి తదితరులు హాజరయ్యారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BJP
- center
- Manik Sarkar
- RSS
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎక్కువ ఈఎంఐ కట్టడమా?.. కాల వ్యవది పెంచుకోవమా?.. ఆర్బీఐ వడ్డీరేటు పెంచిన తరువాత ఏది బెటర్
Trishula Snanarchana | వేయిస్తంభాల ప్రాచీనకోనేరులో త్రిశూలస్నానార్చన
Theft Attempt | దొంగతనం చేసేందుకు సీసీ కెమెరాను బ్లర్ చేశారు.. కానీ ఏమైందో చూడండి.. వీడియో
AP News | ఏపీలో పలుచోట్ల టీడీపీ, వైసీపీ వర్గీయుల బాహాబాహీ..!
‘ప్రత్యామ్నాయ పంటలతో రైతులకు అధిక ఆదాయం’
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

