హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): మహాకవి దాశరథి కృష్ణమాచార్యుల 101వ జయంతి వేడుకలు తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో బుధవారం రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణీప్రసాద్, తె లంగాణ సాంస్కృతిక సారథి డా. ఏను గు నరసింహారెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ బాలాచారి, ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, దాశరథి కుమారుడు లక్ష్మణ్, కుమార్తె ఇందిర, సభ సమన్వయకర్త బడేసాబ్, ప్రముఖ కవులు అమ్మంగి వేణుగోపాల్, ఘంటా మనోహర్‌రెడ్డి, సంగనభట్ల నరసయ్య, రామకృష్ణ చంద్రమౌళి తదితరులు దాశరథి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సాహితీవేత్తలు మాట్లాడుతూ.. దాశరథి కృష్ణమాచార్యులు సాహిత్యం భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేరొన్నారు. అనంతరం ప్రముఖ కవి అందెశ్రీ రచించిన ‘సాహిత్యం పాటల పూదోట -అందెల సవ్వడి’ గ్రంథాన్ని ఆవిషరించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన కవులు, రచయితలు, సాహితీవేత్తలు, సాహిత్యాభిమానులు పెద్దసంఖ్యలో హాజరై మహాకవికి ఘనంగా నివాళులర్పించారు.