జగిత్యాల : రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల(Minister Koppula) ఈశ్వర్ పుట్టిన రోజు(Birthday) వేడుకలను గురువారం బీఆర్ఎస్ (BRS) శ్రేణులు ఘనంగా నిర్వహించారు. గొల్లపల్లి మండల కేంద్రం, వెల్గటూర్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు.
ధర్మపురి శ్రీ లక్ష్మినరసింహ స్వామి దేవస్థానంతో పాటు అనుబంధ దేవాలయాల్లో మంత్రి పేరున స్వామివారికి అభిషేకాలు జరిపారు. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మంత్రి ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయుష్సు హోమం , ప్రత్యేక పూజలు, పెగడపల్లి మండల కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఆవరణలో వేడుకలు నిర్వహించారు.