పాఠశాలల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి
రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి చేయాలని, ఇందుకు విద్యాశాఖ తగిన చర్యలు చేపట్టాలని బడుల్లో పిల్లల భద్రతపై ప్రభుత్వం నియమించిన కమిటీ ప్రతిపాదించింది.
- విద్యార్థుల రక్షణలో రాజీ లేదు
- మంత్రి సబితా ఇంద్రారెడ్డి
హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి చేయాలని, ఇందుకు విద్యాశాఖ తగిన చర్యలు చేపట్టాలని బడుల్లో పిల్లల భద్రతపై ప్రభుత్వం నియమించిన కమిటీ ప్రతిపాదించింది. ఏదైనా ఘటన జరిగితే పాఠశాల యాజమాన్యాలదే బాధ్యత అని, వెంటనే సదరు పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని సూచించింది. విద్యార్థుల రక్షణ, భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్ర భుత్వం నియమించిన కమిటీ సమావేశం శనివారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్హెచ్చార్డీ)లో జరిగింది.
విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డీజీపీ మహేందర్రెడ్డి, అదనపు డీజీపీ స్వాతిలక్రా, విద్యాశాఖ కార్యదర్శి వా కాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్యాదేవరాజన్, డీఐజీ సుమతి, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ పిల్లలు గౌరవంగా ఉంటూ సురక్షిత వాతావరణంలో అభ్యసించే అవకాశాన్ని కల్పించే బాధ్యత యాజమాన్యాలదే అన్నారు. బడితోపాటు, పరిసరాలు సురక్షితమైనవిగా, రక్షణాత్మకమైనవిగా తీర్చిదిద్దాలన్నారు. విద్యార్థుల రక్షణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన భద్రతా కమిటీ పలు సూచనలు చేసిందని, ప్రస్తుత పరిస్థితులకనుగుణంగా ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుందో కూడా తెలియజేయాలని మంత్రి కమిటీ సభ్యులను కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

