MLA Rajasingh | గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు
నిత్యం వివాదాల నడుమ ఉండే గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై (MLA Rajasingh) మరో కేసు నమోదైంది. శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఆయనపై పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు.
హైదరాబాద్: నిత్యం వివాదాల నడుమ ఉండే గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై (MLA Rajasingh) మరో కేసు నమోదైంది. శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఆయనపై పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. సుల్తాన్‌బజార్ పీఎస్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న మధుసూదన్ ఫిర్యాదుమేరకు అదే పోలీస్ స్టేషన్లో ఐపీసీ 188, 290 రెడ్‌విత్ 34, సిటీ పోలీస్ యాక్ట్ 21/76 సెక్షన్ల కింద కేసు పెట్టారు. రాజాసింగ్ హనుమాన్ వ్యాయామశాల వద్ద మాట్లాడుతూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని అందులో పేర్కొన్నారు. ఐదు రోజుల క్రితం శ్రీరామనవమి శోభాయాత్రలో భాగంగా అఫ్జల్‌గంజ్ ఠాణాలో ఆయనపై కేసు నమోదైంది.
వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచే రాజాసింగ్‌పై.. గత అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ సస్పెన్షన్ వేటువేసిన విషయం తెలిసిందే. అయితే పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటించడానికి కొన్ని గంటల ముందు సస్పెన్షన్ ఎత్తివేసిన పార్టీ అధిష్ఠానం మళ్లీ ఆయననే గోషామహల్ అభ్యర్థిగా బరిలో నిలిపింది. ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన.. అసెంబ్లీలో బీజేఎల్పీ నేత పదవిని ఆశించారు. అయితే మహేశ్వర్ రెడ్డికి ఆ పదవిని అప్పజెప్పడంతో అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

