Telangana | మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కేసు నమోదు
Telangana | బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. తాజాగా మరో ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసింది.
Telangana | కుమ్రంభీం ఆసిఫాబాద్ : బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. తాజాగా మరో ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసింది.
ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీపై కేసు నమోదైంది. కుమ్రంభీం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ మధ్య ప్రోటోకాల్ రగడ తారాస్థాయికి చేరింది. ప్రోటోకాల్ వివాదం వ్యక్తిగత ఘర్షణలకు దారి తీసింది. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు ధర్నాలకు దిగారు. రాస్తారోకోలు చేపట్టారు. అయితే విశ్వప్రసాద్ రావు ఉద్దేశపూర్వకంగా ఎమ్మెల్యే కోవా లక్ష్మీపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు 296(బీ), 351(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశంలో కలెక్టర్ సహా అధికారుల విధులకు ఆటంకం కలిగించిన అభియోగాలపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కరీంనగర్ వన్ టౌన్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. బీఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 221, 126(2) కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. జిల్లా పరిషత్ అధికారుల ఫిర్యాదుతో చర్యలు తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

