వరంగల్‌లో పార్కింగ్ చేసిన కారు చోరీ
వరంగల్ నగరంలో పార్కింగ్ చేసిన కారు చోరీ జరిగింది. మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ ఘటన చోటుచేసుకొన్నది.
- క్రేన్‌తో తీసుకెళ్లి స్క్రాప్ చేసి విక్రయం
- నిందితుడు ఫయాజ్ అరెస్ట్
సుబేదారి, డిసెంబర్ 16 : వరంగల్ నగరంలో పార్కింగ్ చేసిన కారు చోరీ జరిగింది. మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ ఘటన చోటుచేసుకొన్నది. వివరాల్లోకెళ్తే… ములుగురోడ్డు హనుమాన్ జంక్షన్-ఆటోనగర్ ప్రధాన రోడ్డులోని స్నేహితుడి ఇంటి ఖాళీ స్థలంలో మెట్టు జయపాల్‌రెడ్డి కొద్ది రోజుల క్రితం తన ఇండికా కారు రిపేరుకు రావడంతో పార్కింగ్ చేశాడు. ఈ కారును ఆటోనగర్‌లో వాహనాల స్క్రాప్ షాపు నిర్వహిస్తున్న ఫయాజ్ గమనించాడు.
రెండు రోజుల క్రితం రాత్రి వేళ క్రేన్‌తో తన షాపునకు తీసుకొచ్చి, స్క్రాప్చేసి విడిభాగాలను అమ్మేశాడు. బాధితుడు జయపాల్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు పార్కింగ్ చేసిన స్థలం, రోడ్డులో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. కారును క్రేన్‌తో ఆటోనగర్‌కు తీసుకువెళ్లినట్లు సీసీ కెమెరాల ఫుటేజీలో రికార్డు అయ్యాయి. ఫయాజ్ను పోలీసులు అరెస్టు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

