హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ ఎకనామిక్స్ పరీక్షను రద్దుచేసినట్టు ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ పీవీ శ్రీహరి తెలిపారు. మంగళవారం నిర్వహించిన ఎకనామిక్స్ పరీక్షకు తెలుగు మీడియం పేపర్లకు బదులుగా విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం పేపర్లు అందాయన్నారు.
దీంతో పరీక్షను రద్దు చేశామని, తిరిగి 13న నిర్వహిస్తామని తెలిపారు.