Telangana Assembly | స్పీకర్ చాంబర్లో ప్రారంభమైన బీఏసీ సమావేశం..
Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీ ఆవరణలోని స్పీకర్ చాంబర్లో బీఏసీ(బిజినెస్ అడ్వైజరీ కమిటీ) సమావేశమైంది. బీఏసీ సమావేశంలో అసెంబ్లీ నిర్వహణ తేదీలను ఖరారు చేయనున్నారు. పది రోజుల పాటు సభను నిర్వహించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం.
Telangana Assembly | హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఆవరణలోని స్పీకర్ చాంబర్లో బీఏసీ(బిజినెస్ అడ్వైజరీ కమిటీ) సమావేశమైంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్లు, బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం నుంచి బలాల హాజరయ్యారు.
బీఏసీ సమావేశంలో అసెంబ్లీ నిర్వహణ తేదీలను ఖరారు చేయనున్నారు. పది రోజుల పాటు సభను నిర్వహించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. ఇక ఈ నెల 25న అసెంబ్లీలో బడ్జెట్ను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్నారు. అదే రోజు ఉదయం 9 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కేబినెట్ భేటీ అయి రాష్ట్ర బడ్జెట్కు ఆమోదం తెలుపనున్నారు. అనంతరం సభలో బడ్జెట్ను చదివి వినిపించనున్నారు ఆర్థిక మంత్రి.
కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపట్ల శాసనసభ సంతాపం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆమె మృతికి సంతాపంగా సభ్యులందరూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం సభను బుధవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు.
ఇవి కూడా చదవండి..
9 Priorities Of Budget | తొమ్మిది సూత్రాల ఆధారంగా బడ్జెట్ రూపకల్పన : నిర్మలా సీతారామన్
BRS MLAs | గన్ పార్కు వద్ద అమరవీరుల స్థూపానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నివాళి
Union Budget 2025 | ఏపీకి వరాల జల్లు.. తెలంగాణకు మొండిచేయి.. కేంద్ర బడ్జెట్లోని ముఖ్యాంశాలివే..
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

