Minister Srinivas Goud | ఇకపై ప్రతీ ఏడాది బుద్ధ జయంతి ఉత్సవాలు : మంత్రి శ్రీనివాస్ గౌడ్
Minister Srinivas Goud | ప్రతీ ఏడాది హైదరాబాద్‌లో బుద్ధ జయంతోత్సవాలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్(Minister Srinivas Goud) అన్నారు.
ఖైరతాబాద్(హైదరాబాద్) : ప్రతీ ఏడాది హైదరాబాద్‌లో బుద్ధ జయంతోత్సవాలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్(Minister Srinivas Goud) అన్నారు. 2567వ బుద్ధ పూర్ణిమ సందర్భంగా ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో శుక్రవారం అంబేద్కర్ ప్రాంగణంలో బౌద్ధ పీస్ కార్ ర్యాలీ(Peace Car Rally)ని జెండాను ఊపి ప్రారంభించారు.
ఆయన మాట్లాడుతూ ‘ఈ సారి బుద్ధ జయంతి(Buddha Jayanti ) కి ఓ ప్రత్యేకత ఉంది. ఓ వైపు సాక్షాత్తు మహనీయుడు 125 అడుగుల బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం, మరో వైపు అంబేద్కర్ సచివాలయం. ఈ ప్రాంతంలో బౌద్ధ జయంతిని ప్రారంభించుకోవడం అద్భుతమైన ఘట్టమ’ని అన్నారు. గౌతమబుద్ధుడు, మహాత్యాజ్యోతిరావు పూలేలను ఆదర్శంగా తీసుకొని బాబా సాహెబ్ అంబేద్కర్(BR Ambedkar ) రాజ్యాంగాన్ని రచించారన్నారు. నాగార్జునుడు నివసించిన పవిత్రమైన ప్రాంతం తెలంగాణ అని గుర్తు చేశారు. ఆసియా ఖండంలోనే అతి పెద్ద బుద్ధవనాన్ని ఇక్కడ నిర్మించుకున్నామన్నారు.
తెలంగాణలో ఎక్కడ తవ్వకాలు జరిగినా అక్కడ బౌద్ధ స్థూపాలు లభిస్తున్నాయన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) చరిత్రకు గుర్తింపునిచ్చారని, కవులు, కళాకారులు, మహనీయులకు ప్రాధాన్యత కల్పించారన్నారు. ఈ కార్యక్రమంలో బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు జి. పరందాములు, ఉపాధ్యక్షులు డాక్టర్ సతీశ్, జి. రాజేశ్వర్ రావు, అశోక్ భాగ్యవన్, సుదర్శన్, సలహాదారులు చింతా శ్రీరామమూర్తి, కేకే రాజా, రావుల అంజయ్య, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
‘బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలి’
‘కుష్టు లక్షణాలను దాచిపెడితే ముప్పు’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

