నచ్చిన సబ్జెక్టు చదవొచ్చు

- సబ్జెక్టుల ఎంపికలో ‘బకెట్ ఆఫ్ కోర్సెస్’
- మూడేండ్ల డిగ్రీలో నాలుగు బకెట్లు
- బీఎస్సీలో 23 రకాల కాంబినేషన్లు
- అన్ని కాలేజీల్లో విజయవంతంగా అమలు
సివిల్స్‌లో కొంతమంది ఫిలాసఫీ సబ్జెక్టు ఎంచుకుంటున్నారు. వారికి ఇంటర్, డిగ్రీ, బీటెక్‌లో ఆ సబ్జెక్టే కనిపించదు. కొత్త సబ్జెక్టు ఫిలాసఫీని తీసుకొని కష్టపడుతున్నారు. సివిల్స్ కల సాకారం చేసుకొంటున్నారు. ఇదే ఫిలాసఫీ డిగ్రీలోనే ఉంటే.. సబ్జెక్టుపై పూర్తి పట్టు వస్తుంది. అవగాహన ఉంటుంది. కొత్త సబ్జెక్టు అన్న భయం ఉండదు. బెరుకులేకుండా సివిల్స్ సాధించవచ్చు. ఈ అవకాశాన్ని తెలంగాణలోని విద్యార్థులు పొందుతున్నారు. ఇందుకు వీలు కల్పిస్తున్నదే ‘బకెట్ ఆఫ్ కోర్సెస్’ (బీసీఎస్) విధానం.
హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): విద్యార్థి.. నచ్చిన సబ్జెక్టును ఎంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన బకెట్ ఆఫ్ కోర్సెస్ విధానం సక్సెస్ అయింది. రాష్ట్రంలో గతేడాది నుంచి ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో అమలుచేస్తున్న ఈ విధానం సత్ఫలితాలిస్తున్నది. బకెట్ ఆఫ్ కోర్సెస్ విధానానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. డిగ్రీలో ఏదేని మూడు సబ్జెక్టులను తప్పనిసరిగా చదవాల్సి ఉంటుంది. సంప్రదాయ కోర్సులకు భిన్నంగా.. ఈ బకెట్ విధానం ద్వారా కొత్త వాటిని ఎంచుకొనే అవకాశం ఇస్తారు. ఉదాహరణకు బీఎస్సీ బీజెడ్సీ విద్యార్థులు బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ చదువుతున్నారు. బకెట్ విధానంలో జువాలజీ స్థానంలో నచ్చిన ఇతర ఏదైనా కోర్సును ఎంపికచేసుకునే అవకాశం కల్పిస్తారు. డిగ్రీలో మొత్తం సబ్జెక్టులను నాలుగు బకెట్లుగా విభజించారు. ఒక్కోదాంట్లో ఒకటి నుంచి ఆరు సబ్జెక్టులు ఉంటాయి. ఈ నాలుగు బకెట్లలో నుంచి ఏవేని మూడు కోర్ సబ్జెక్టులను విద్యార్థి ఎంచుకొనే సదుపాయం కల్పించారు. ఉదాహరణకు ఒక విద్యార్థి జాగ్రఫీని చదవాలనుకున్నాడు. అతడు పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌తో ఎలెక్టివ్ విధానంలో జాగ్రఫీని చదివే వెసులుబాటు కలుగుతుంది. డిగ్రీలో చేరిన విద్యార్థులు ఇదివరకు ఆయా కాలేజీలో ఉన్న కోర్సుల్లోనే చేరేవారు. ఇప్పుడు సీటు పొందితే చాలు.. ఆ కాలేజీలో కోర్సు లేకపోయినా అడ్మిషన్ పొందే వీలు ఉంటుంది. నచ్చిన కోర్సు ఆయా కాలేజీలో లేకపోతే స్వయం పోర్టల్ ద్వారా ఆన్లైన్లో చదువుకోవచ్చు. ఇందుకు క్రెడిట్ ఇస్తారు.
బకెట్ ఆఫ్ కోర్సులు ఇలా..
- బీఎస్సీ లైఫ్ సైన్సెస్ (ఇంగ్లిష్ మీడియం)
బాటనీ/మైక్రోబయాలజీ, డెయిరీ సైన్స్, పౌల్ట్రీ సైన్స్, జువాలజీ, క్రాఫ్ ప్రొడక్షన్, ఫారెస్ట్రీ, కెమిస్ట్రీ, సైకాలజీ, ఫిషరీస్, ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ, కంప్యూటర్ సైన్స్, జెనెటిక్స్, అప్లయిడ్ న్యూట్రిషన్, న్యూట్రిషన్, ఫుడ్‌సైన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్, న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్, ఫుడ్ టెక్నాలజీ, అప్లయిడ్ న్యూట్రిషన్ అండ్ పబ్లిక్ హెల్త్, ఫోరెన్సిక్ సైన్స్, జియాలజీ, సెరికల్చర్ వంటి సబ్జెక్టులుంటాయి. - బీఎస్సీ లైఫ్ సైన్సెస్ (తెలుగు మీడియం)
వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, రసాయనశాస్త్రం, కంప్యూటర్ సైన్స్ - బీఏ సీబీసీఎస్ (తెలుగు)
చరిత్ర, అర్ధశాస్త్రం, తెలుగు, మోడ్రన్ లాంగ్వేజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, కంప్యూటర్ అప్లికేషన్స్, సోషియాలజీ, జర్నలిజం. - బీఏ సీబీసీఎస్ (ఆంగ్లం)
చరిత్ర, మార్కెటింగ్ మేనేజ్మెంట్, గణితం, ఆఫీస్ మేనేజ్మెంట్, ఇంగ్లిష్ లిటరేచర్, ఆర్థికశాస్త్రం, టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్, ఇంగ్లిష్ మోడ్రన్ లాంగ్వేజీ, రాజనీతిశాస్త్రం, కమ్యూనికేటివ్ ఇంగ్లిష్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, కంప్యూటర్ అప్లికేషన్స్, సోషియాలజీ, జాగ్రఫీ, మాస్ కమ్యూనికేషన్స్ అండ్ జర్నలిజం, ఫిలాసఫీ, మార్కెటింగ్ కమ్యూనికేషన్ అండ్ మీడియా స్టడీస్. - బీఎస్సీ డాటా సైన్స్ (ఇంగ్లిష్)
గణితం, స్టాటిస్టిక్స్, డాటా సైన్స్ - బీఎస్సీ ఫిజికల్ సైన్స్ (ఇంగ్లిష్)
గణితం, ఫిజిక్స్, ఎకనామిక్స్, కెమిస్ట్రీ, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్, అప్లయిడ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ హార్డ్‌వేర్, కంప్యూటర్ సైన్స్, జియాలజీ, జాగ్రఫీ, నెట్వర్క్స్ అండ్ హార్డ్‌వేర్.
రాష్ట్రంలో సత్ఫలితాలు
విద్యార్థులకు అన్నిరంగాల్లో తర్ఫీదునిచ్చేందుకు వీలుగా చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం తీసుకొచ్చారు. దీన్ని పూర్తిస్థాయిలో అమలుచేయడంలో భాగంగానే డిగ్రీలో బకెట్ ఆఫ్ కోర్సెస్‌ను ప్రవేశపెట్టారు. రాష్ట్రంలోని 1,054 కాలేజీల్లో ఈ విధానం ద్వారా కోర్సులను ఎంపికచేసుకోవచ్చు. ఇదివరకు బీఎస్సీలో నాలుగైదు కాంబినేషన్లు మాత్రమే ఉండేవి. కానీ, బకెట్ విధానంలో 23 రకాల కాంబినేషన్లు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్‌లోని సిటీ కాలేజీలో విద్యార్థులు ఈ 23 రకాల కాంబినేషన్లలోని కోర్సుల్లో ప్రవేశాలు పొందారు. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్)లో ఈ నెల 1 నుంచి మొదటివిడత ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇందులో బకెట్ విధానాన్ని అమలుచేస్తున్నారు.
అభిరుచులకు తగ్గ సబ్జెక్టులు
బకెట్ ఆఫ్ కోర్సెస్ విధానాన్ని తెలంగాణలో విజయవంతంగా అమలుచేస్తున్నాం. చాయిస్ బేస్ట్ క్రెడిట్ సిస్టం అమల్లో భాగంగా బకెట్ విధానాన్ని అనుసరిస్తున్నాం. దేశంలో మరెక్కడా ఇలాంటి విధానాన్ని అమలుచేసిన దాఖలాలు లేవు. విద్యార్థుల అభిరుచులకు తగ్గ కోర్సుల సమ్మేళనాలను అందుబాటులోకి తెచ్చాం. దీన్ని విద్యార్థులు చక్కగా ఆస్వాదిస్తున్నారు. నచ్చిన సబ్జెక్టుల్లో చేరుతున్నారు. ఈ ఏడాది సైతం విద్యార్థులు బకెట్ విధానంలోనే అడ్మిషన్లు పొందవచ్చు.
ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, దోస్త్ కన్వీనర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiran Abbavaram | బాల్యపు జ్ఞాపకాలను గుర్తుచేసే ‘సమ్మర్ హాలిడేస్’.. కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు
Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి పిలుపు ప్రత్యేకం.. ఒక్కో ఆహ్వాన పత్రిక ఖర్చు రూ.20 వేల వరకు!
Sreeleela | రజినీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల.. స్పెషల్ ప్రీ లుక్‌తో హింట్ ఇచ్చిన మేకర్స్!
EAPCET Office | గెస్ట్‌హౌస్‌గా ఎప్‌సెట్ ఆఫీస్.. అడ్మిషన్ల వేళ జేఎన్టీయూ సంచలన నిర్ణయం!
Congress | రైతును కూలీగా మార్చిన కాంగ్రెస్.. యాదాద్రి జిల్లా కొండ్రెడ్డిచెరువులో దుస్థితి
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

