KTR | నేడు, రేపు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సంబురాలు.. కేటీఆర్ పిలుపు
KTR | విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) తిరస్కరించినందుకు రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు జరపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రజలపై రూ.18500 కోట్ల భారం పడకుండా ఆపినందుకు విజయ సూచికగా ఈ సంబురాలు నిర్వహించాలని కోరారు.
KTR | విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) తిరస్కరించినందుకు రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు జరపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రజలపై రూ.18500 కోట్ల భారం పడకుండా ఆపినందుకు విజయ సూచికగా ఈ సంబురాలు నిర్వహించాలని కోరారు. రాష్ట్రంలోని జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాల్లో సంబరాలు జరపాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
పది నెలల కాలంలోనే 18500 కోట్ల విద్యుత్ ఛార్జీల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు చేసిందని కేటీఆర్ అన్నారు. ప్రజలపై విద్యుత్ భారం మోపడాన్ని ప్రధాన ప్రతిపక్షంగా వ్యతిరేకించామని తెలిపారు. పబ్లిక్ హియరింగ్లో పాల్గొని దీనిపై ఈఆర్సీపి ఒప్పించలిగామని చెప్పారు. ప్రధాన ప్రతిపక్షంగా తమ వాదనలోని సహేతుకత, న్యాయాన్నిను ఈఆర్సీ గుర్తించి విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనను తిరస్కరించిందని అన్నారు.
విద్యుత్ పెంపు ప్రతిపాదనలను తిరస్కరించినందుకు ఈఆర్సీ చైర్మన్ శ్రీ రంగారావు, సభ్యులు మనోహర్ రాజు, కృష్ణయ్యకు తెలంగాణ ప్రజల తరపున బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. విద్యుత్ చార్జీల పేరిట రూ. 18,500 కోట్ల అదనపు భారం ప్రజలపై మోపడాన్ని హైదరాబాద్, నిజామాబాద్, సిరిసిల్లలో నిర్వహించిన మూడు బహిరంగ విచారణలలో తాము తీవ్రంగా వ్యతిరేకించామని కేటీఆర్ తెలిపారు. ఇది తెలంగాణ ప్రజల విజయం అని కేటీఆర్ పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- current charges
- ERC
- KTR
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

