KTR | కేటీఆర్‌కు మరో అరుదైన ఆహ్వానం.. ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరమ్‌లో ప్రసంగించాలని పిలుపు
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మరో అరుదైన ఆహ్వానం అందింది. ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరమ్ 2025లో ప్రసంగించేందుకు రావాలని ఆహ్వానించారు. జూన్ 20, 21వ తేదీల్లో ఈ ఫోరమ్ సమావేశం జరగనుంది.
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మరో అరుదైన ఆహ్వానం అందింది. ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరమ్ 2025లో ప్రసంగించేందుకు రావాలని ఆహ్వానించారు.
ఈ ఫోరమ్ జూన్ 20, 21వ తేదీల్లో యూకేలోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో జరగనుంది. ‘ భారత అభివృద్ధికి ఫ్రంటీయర్ టెక్నాలజీస్’ అనే థీమ్‌పై ఈ ఏడాది ఫోరమ్ దృష్టిసారించింది. భారత్‌లో సాంకేతికత, ఇన్నోవేషన్, సస్టైనబిలటీని కలగలిపి ముందుకెళ్లే అంశాలపై ఈ ఫోరమ్‌లో చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలో తన విలువైన అభిప్రాయాలను తెలియజేసేందుకు రావాలని కేటీఆర్‌కు ఫోరమ్ వ్యవస్థాపకుడు, చైర్పర్సన్ సిద్ధార్థ్ సెథీ ఆహ్వాన లేఖ పంపించారు. “భారతదేశ అభివృద్ధికి మీరు చూపించిన మార్గదర్శకత, టెక్నాలజీ ఆధారిత పాలన, పెట్టుబడుల వృద్ధికి మీరు తీసుకున్న చర్యలు అంతర్జాతీయ వేదికపై యువతకు ప్రేరణ కలిగిస్తాయి” అని ఆయన లేఖలో పేర్కొన్నారు.
ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరమ్‌లో ‘భారత అభివృద్ధికి అత్యాధునిక సాంకేతికతలు’ అనే ప్రధాన అంశంపై చర్చ జరగనుంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు తీసుకున్న చర్యలు, అభివృద్ధి దిశగా అమలు చేసిన పారిశ్రామిక విధానాలు, ప్రజా సేవలను మెరుగుపరచడంలో సాంకేతిక వినియోగం వంటి అంశాలపై ఆయన ప్రసంగించనున్నారు.

Oxford
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- India
- Invitation
- KTR
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

