KTR | లగచర్ల రైతులకు న్యాయం జరిగే దాకా పోరాడతాం.. అధైర్యపడొద్దు : కేటీఆర్
KTR | తెలంగాణ అసెంబ్లీలో అరాచక, దుర్మార్గమైన ప్రభుత్వం తీరును ప్రజలు గమనిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. భూములు ఇవ్వని పాపానికి దళిత, బలహీనవర్గాల రైతులను జైల్లో పెట్టారని మండిపడ్డారు. భూములు ఇవ్వమన్న రైతులపై కేసులు పెట్టడమే కాకుండా థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
KTR | తెలంగాణ అసెంబ్లీలో అరాచక, దుర్మార్గమైన ప్రభుత్వం తీరును ప్రజలు గమనిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. భూములు ఇవ్వని పాపానికి దళిత, బలహీనవర్గాల రైతులను జైల్లో పెట్టారని మండిపడ్డారు. భూములు ఇవ్వమన్న రైతులపై కేసులు పెట్టడమే కాకుండా థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
లగచర్ల రైతులపై ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై శాసన సభలో చర్చించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టడంతో అసెంబ్లీని రేపటికి వాయిదా వేశారు. దీంతో శాసనసభ లోపలికి వెళ్లే దారిలో కూర్చుని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. ప్లకార్డులతో నిరసనలు తెలిపారు. గిరిజన రైతులకు సంకెళ్లా.. ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం.. దోపిడీ రాజ్యం.. దొంగల రాజ్యం అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. లగచర్ల అంశంపై చర్చించరట కానీ.. పర్యాటకంపై చర్చిస్తామంటున్నారని మండిపడ్డారు.
రైతులకు బేడీలు – మంత్రులకు జల్సాలు
గిరిజన రైతుల చేతికి బేడీలా – సిగ్గు.. సిగ్గు
లగచర్ల రైతులకు మద్దతుగా అసెంబ్లీ ఆవరణలో ప్లకార్డులతో నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. pic.twitter.com/rZzOkEosTp
— BRS Party (@BRSparty) December 16, 2024
లగచర్ల రైతులు ముగ్గురు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని కేటీఆర్ తెలిపారు. ఓ రైతుకు గుండెపోటు వస్తే బేడీలతో ట్రీట్మెంట్ చేయించారని పేర్కొన్నారు. కొడంగల్ నీ జాగీరా.. రైతుల భూములు గుంజుకుంటారా అని మండిపడ్డారు. ఎన్ని కుయుక్తులు చేసినా రైతుల తరఫున పోరాడతామని స్పష్టం చేశారు. ఆదానీతో రేవంత్ దోస్తీని నిలదీయాలని టీషర్టులతో వస్తే లోనికి వెళ్లనీయలేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లగచర్ల రైతుల అంశంపై చర్చించాలని పట్టుబట్టినా చర్చ పెట్టలేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలపై అసెంబ్లీలో నిలదీస్తామని స్పష్టం చేశారు. న్యాయం జరిగేదాకా పోరాడుతామని.. లగచర్ల రైతులు అధైర్యపడవద్దని ధైర్యం చెప్పారు. ఫార్మాసిటీకి 14 వేల ఎకరాలను సేకరించి పెడితే కాంగ్రెస్ ప్రభుత్వమే వద్దన్నదని తెలిపారు. రైతులకు రేవంత్ రెడ్డి భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ఢిల్లీకి వెళ్లి రాష్ట్రానికి రూపాయి తెచ్చింది లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ప్రశ్నించినా, సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టినా జైలుకు పంపిస్తామని రేవంత్ రెడ్డి బెదిరింపులకు గురి చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కొనసాగుతున్నది అరాచక ప్రభుత్వమా? ప్రజాస్వామ్య ప్రభుత్వమా అని కేటీఆర్ నిలదీశారు. రాజ్యాంగేతర శక్తిగా రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srinivas Goud | హాస్టళ్ల మూసివేత నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
నాగుల చవితి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ ఫలాలు పక్కదారి!
‘చిరుధాన్యాల సాగుపై రైతులు దృష్టి సారించాలి’
తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌కు ప్రమాదంలో భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

