సంగారెడ్డి సై.. అందోల్జై!
సంగారెడ్డి సై అంది.. అందోల్ జైకొట్టింది.. చేవెళ్లలో జోరు.. షాద్‌నగర్‌లో జనం హుషారు పెద్ద ఎత్తున ఆవిష్కృతమైంది. సోమవారం జరిగిన సీఎం కేసీఆర్ ప్రజాఆశీర్వాద సభలకు అంచనాకు మించిన జనం తరలివచ్చారు. నాలుగుచోట్ల ప్రజా ఆశీర్వాద సభలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి.
- చేవెళ్ల జోరు.. షాద్‌నగర్ హుషారు!
- ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాఆశీర్వాద సభలు సక్సెస్
- అన్ని సభలకూ అంచనాకు మించి భారీ జనం
- జననేత, సీఎం కేసీఆర్ ప్రసంగానికి విశేష స్పందన
- రైతుబంధు, ధరణి, కరెంటు ఉండాలంటూ నినాదం
- నృత్యాలు, కేరింతలతో అంతటా జనంలో జోష్
సంగారెడ్డి/అందోల్/రంగారెడ్డి/షాద్‌నగర్, నవంబర్ 27(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి సై అంది.. అందోల్ జైకొట్టింది.. చేవెళ్లలో జోరు.. షాద్‌నగర్‌లో జనం హుషారు పెద్ద ఎత్తున ఆవిష్కృతమైంది. సోమవారం జరిగిన సీఎం కేసీఆర్ ప్రజాఆశీర్వాద సభలకు అంచనాకు మించిన జనం తరలివచ్చారు. నాలుగుచోట్ల ప్రజా ఆశీర్వాద సభలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. అన్నిచోట్ల రైతుబంధు, ధరణి, 24 గంటల విద్యుత్తు ఉండాలా? వద్దా? అన్ని కేసీఆర్ ప్రశ్నకు అన్ని సభల్లో ఉండాల్సిందేనంటూ ప్రజలు ఉవ్వెత్తున నినదించారు.
సంగారెడ్డిలోని తార డిగ్రీ కళాశాల గ్రౌండ్లో ఎమ్మెల్యే అభ్యర్థి చింతా ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన సభకు నియోజకవర్గంలోని అన్ని మండలాలు, సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల నుంచి వేలాది జనం తరలివచ్చారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన వాహనాలతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి వేలాది మంది సభాస్థలికి చేరుకోలేకపోయారు. సభకు హాజరైన జనం నృత్యాలు చేస్తూ, కేరింతలు కోడుతూ సందడి చేశారు. బహిరంగ సభకు వచ్చిన జనం స్పందనను చూసి ఎమ్మెల్యే అభ్యర్థి చింతా ప్రభాకర్ భావోద్వేగానికి గురై వేదికపైనే కంటతడిపెట్టారు. మంత్రి హరీశ్‌రావు ఆయనను సముదాయించారు.
అందోలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చంటి క్రాంతికిరణ్ అధ్యక్షతన జరిగిన సభకు జనం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. డప్పుచప్పుళ్లు, బ్యాండ్ మేళాలతో సభకు వివిధ గ్రామాల నుంచి స్వచ్ఛందంగా తరలివచ్చారు. అభ్యర్థి చంటి క్రాంతికిరణ్ కొద్దిసేపు డ్యాన్స్‌చేసి కార్యకర్తల్లో జోష్ నింపారు. సీఎం కేసీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు చప్పట్లు కొడుతూ, కేరింతలు కొడుతూ సందడి చేశారు. తాను ఈ ప్రాంత బిడ్డనే, ఈ ప్రాంతమీద మమకారం ఉంటది, ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డనే కదా.. అంటూ పైరెండు చోట్ల సాగిన ప్రసంగం జిల్లావాసులను కట్టిపడేసింది.
గుండెల నిండా అభిమానం.. చేతుల్లో గులాబీ జెండా
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో, షాద్‌నగర్‌లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కాలె యాదయ్య, అంజయ్య యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజాఆశీర్వాద సభలకు జనహోరు పోటెత్తింది. గుండెల నిండా అభిమానంతో గులాబీ జెండాలు చేతబూని.. మెడలో గులాబీ కండువాలు ధరించి తరలివచ్చిన సబ్బండ వర్ణాల ప్రజానీకంతో రెండు పట్టణాలు జనసంద్రాలయ్యాయి. జనంతో సభా ప్రాంగణాలు కిక్కిరిసిపోగా, బయట రోడ్లమీదనే ఉండి ముఖ్యమంత్రి ప్రసంగాన్ని ఆలకించారు.
ముస్లింలను ఉద్దేశించి రెండు సభల్లోనూ సీఎం కేసీఆర్ హిందీలో ప్రసంగించడంతో ఆ వర్గాల్లో సంతోషం వ్యక్తమైంది. బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చిన జనం జై కేసీఆర్.. జై తెలంగాణ.. అన్ని నినాదాలు మిన్నంటాయి. చప్పట్లు, ఈలలతో జనామోదాన్ని తెలిపారు. పాలమూరు ఎత్తిపోతలతో త్వరలోనే ఆయా నియోజకవర్గాల్లో కృష్ణా నీటిని పారిస్తామని కేసీఆర్ చెప్పడంతో విశేష స్పందన కనిపించింది. చేవెళ్ల నియోజకవర్గం మొత్తానికి ఒకే విడతలో దళితబంధు మంజూరు చేస్తామన్న కేసీఆర్ ప్రకటనతో కరతాళ ధ్వనులు మార్మోగాయి. రెండు ఆశీర్వాద సభల్లోనూ నాటి కాంగ్రెస్ పాలనను సీఎం కేసీఆర్ కడిగి పారేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

