BRS Party | తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి స్థానం లేదు.. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ సర్కారే అని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్( Minister Gangula Kamalaker ) స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం( Telangana Govt ) అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి బీజేపీ( BJP ), కాంగ్రెస్ పార్టీ( Congress Party )ల నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని మంత్రి తెలిపారు.
కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామానికి చెందిన ఏడో వార్డు సభ్యులు మౌనిక కిరణ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. బీఆర్ఎస్లో చేరిన వారికి తప్పకుండా సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సుడా డైరెక్టర్ షేక్ యూసఫ్, టి శ్రీనివాస్ శంకరాచారి, నరేందర్, పున్ని యాదవ్, యూసుఫ్, మల్లేష్ రాజ్ కుమార్ తదితరులు పార్టీలో చేరారు.