BRS Party | మరికాసేపట్లో చేవెళ్లలో బీఆర్ఎస్ బహిరంగ సభ
BRS Party | లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల వేదికగా ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నిర్వహిస్తున్న మొదటి బహిరంగసభ కావడంతో నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని సభ విజయవంతానికి కృషిచేస్తున్నారు.
BRS Party | రంగారెడ్డి : లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల వేదికగా ఇవాళ(శనివారం) ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నిర్వహిస్తున్న మొదటి బహిరంగసభ కావడంతో నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని సభ విజయవంతానికి కృషిచేస్తున్నారు. 2 లక్షలకు పైగా జనసమీకరణకు పార్టీ శ్రేణులు కసరత్తుచేస్తున్నాయి. సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ ప్రజా ఆశీర్వాద సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ సభ ద్వారా కేసీఆర్ పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహాన్ని నింపనున్నట్టు తెలుస్తున్నది. చేవెళ్లలోని ఫరా ఇంజనీరింగ్ కాలేజీలో జరిగే బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాన కూడళ్లు, రహదారుల వెంట గులాబీ ఫ్లెక్సీలు, జెండాలతోపాటు ప్రజలు దూరం నుంచి సభను చూసేందుకు ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేశారు. మరికాసేపట్లో సభ ప్రారంభం కానుంది.
లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌కు ముందు నుంచే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ.. గులాబీ దళాన్ని ఎన్నికలకు సన్నద్ధం చేసేలా బీఆర్ఎస్ పార్టీ కసరత్తును ప్రారంభించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో నైరాశ్యంలో ఉన్న పార్టీ క్యాడర్లో జోష్ నింపేలా.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ అగ్రనేతలు ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నారు. ఈ ఏడాది జనవరిలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలను నిర్వహించారు. చేవెళ్లతోపాటు మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, భువనగిరి, మల్కాజిగిరి పార్లమెంటు స్థానాలతో రంగారెడ్డి జిల్లాకు ఉన్న అనుబంధంతో కేసీఆర్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

