తెలంగాణకు సకాలంలో యూరియా పంపండి
తెలంగాణలో వానకాలం సాగుకు రైతులకు అవసరమైన ఎరువులు, యూరియాను సకాలంలో అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర కోరారు.
- రైతులకు నిరుటిలా కష్టాలు వద్దు
- ప్రతి జిల్లాకూ బఫర్ స్టాక్ చేర్చాల్సిందే
- రాజ్యసభలో వద్దిరాజు విజ్ఞప్తి
హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో వానకాలం సాగుకు రైతులకు అవసరమైన ఎరువులు, యూరియాను సకాలంలో అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర కోరారు. రాజ్యసభ జీరో అవర్‌లో ఆయన గురువారం ఈ అంశాన్ని లేవనెత్తారు. ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయరంగమే కీలకమని, ఈ క్రమంలో రైతులకు అండగా నిలువాలని కోరారు.
నిరుటి కష్టాలు పునరావృతం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. గత ఖరీఫ్‌లో తీవ్ర యూరియా కొరత కారణంగా రైతులు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సి వచ్చిందని తెలిపారు. ఈ నేపథ్యంలో కొందరు సృ్పహ తప్పి పడిపోవడం, తోపులాటలో ప్రాణాలు కోల్పోవడం వంటి బాధాకర సంఘటనలు జరిగాయని ఎంపీ సభ దృష్టికి తెచ్చారు.
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని, ఈసారి కేంద్రం ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని ఆయన కోరారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి మేరకు కేంద్రం అదనపు నిల్వలు విడుదల చేసి, పరిస్థితిని మెరుగుపరిచిన విషయాన్ని గుర్తుచేశారు. యూరియా బ్లాక్ మారెటింగ్, అక్రమ నిల్వలను కఠినంగా అణచివేయాలని, రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ప్రతి మండల, జిల్లా కేంద్రంల్లోనూ బఫర్ నిల్వలను ఉంచేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

