MP Ravichandra | కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటా.. రాజ్యసభలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఉద్వేగ ప్రసంగం
MP Ravichandra | పార్లమెంట్ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే పలు ఘటనల్లో భాగస్వామ్యం కావడం తన అదృష్టమని బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఇలాంటి అదృష్టం కల్పించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు.
MP Ravichandra | న్యూఢిల్లీ : పార్లమెంట్ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే పలు ఘటనల్లో భాగస్వామ్యం కావడం తన అదృష్టమని బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఇలాంటి అదృష్టం కల్పించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. త్వరలోనే రాజ్యసభ పదవీ కాలం పూర్తయ్యే సభ్యులకు గురువారం సభ వీడ్కోలు పలికింది. రిటైర్ అయ్యే సభ్యులందరికీ.. చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ మాట్లాడే అవకాశం కల్పించారు.
ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ముగింపు ఉపన్యాసం ఇచ్చారు. 20 నెలల తన పదవీకాలంలో అటు పాత పార్లమెంట్.. ఇటు కొత్త పార్లమెంట్ భవనాల్లో కూర్చునే అవకాశం దొరకడం ఆనందంగా ఉందన్నారు. అనేక దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న… మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఇక్కడే ఇదే సభలో తమ పార్టీ తరపున మాట్లాడే అవకాశం రావడం చారిత్రక సంఘటనగా భావిస్తున్నానని అన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సమ్మక- సారలమ్మ గిరిజన యూనివర్సిటీ తాను ఎంపీగా ఉన్నప్పుడు మంజూరు కావడం మరిచిపోలేనిదన్నారు. కేంద్రం నుంచి నిధుల మంజూరులో రాష్ట్రానికి సంపూర్ణ సహకారం అందించాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ‘రణబాలి’ గ్రాండ్ సక్సెస్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎక్కడంటే?
Mercedes Benz | హైదరాబాద్‌లో మహావీర్ మోటార్స్ సరికొత్త రికార్డ్.. దసరా కానుకగా 50 మెర్సిడేస్ బెంజ్ కార్ల డెలివరీ.. !
Odisha Athletes | కటక్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ఒడిశా అథ్లెట్ల మృతి.. సీఎం సంతాపం
Annamalai | ‘12 ఏళ్లుగా అధికారంలో ఉన్నా, శతృవులను సృష్టించుకోవాల్సి వస్తున్నది’.. బీజేపీపై అన్నామలై విమర్శలు
NZvIND: గ్లెన్ ఫిలిప్స్ 82 నాటౌట్.. ఇండియా టార్గెట్ 226
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

